రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శనివారం ఇండిపెండెంట్ బాప్సి చర్చ్ ఆవరణలో క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీటీసీ సభ్యులు ఎలగందుల అనసూయ నర్సింలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్ పాస్టర్లతో కలిసి 200 మంది పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు, రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు, బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు కానుకలను పంపిణీ చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు పందిర్ల పరుశరామ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవయ్య, పాస్టర్లు మార్కు, క్రీస్తు దాసు, అబ్రహం, మధు, దేవదాసు, సోనా దేవరాజు,ఏసుదాసు, బోన థాసు, రాజేష్, స్వామి, మైకేల్, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.