Daggubati Abhiram: దగ్గుబాటి అభిరామ్ పెళ్లి డేట్, వేదిక ఫిక్స్..అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

దగ్గుబాటి అభిరామ్ ( Daggubati Abhiram ) పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ గత కొద్దిరోజుల నుండి న్యూస్ వైరల్ అయినప్పటికీ ఈ వార్తలపై దగ్గుబాటి ఫ్యామిలీ క్లారిటీ ఇవ్వలేదు.అయితే తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.

 Daggubati Abhiram Wedding Date Venue Fix Do You Know The Girl Background-TeluguStop.com

దగ్గుబాటి అభిరామ్ వరుసకు మరదలు అయ్యే అమ్మాయిని గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.ఇక ఆ అమ్మాయి ఎవరు.

ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అనేది చూస్తే.అభిరామ్ వరసకు మరదలయ్యే అమ్మాయిని పెళ్లాడుతున్నారట.

ఇక ఆ అమ్మాయి పేరు ప్రత్యుష ( Prathyusha ) అని తెలుస్తోంది.వీరిది కారంచేడు అని సమాచారం.

ఫిల్మ్ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.

Telugu Ahimsa, Daggubati Rama, Daggubatisuresh, Prathyusha, Rana, Sri Reddy, Sri

దగ్గుబాటి అభిరామ్ పెళ్లి శ్రీలంక ( Srilanka ) లో గ్రాండ్ గా జరగబోతుందట.ఇక ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు అది తక్కువ మంది మాత్రమే హాజరు కాబోతున్నట్లు సమాచారం.ఇక ఈ జంట శ్రీలంక లో గ్రాండ్ గా డిస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దగ్గుబాటి ఫ్యామిలీలో పెళ్లి పనులు స్టార్ట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నప్పటికీ పెళ్లికి సంబంధించిన ఎలాంటి న్యూస్ మాత్రం దగ్గుబాటి ఫ్యామిలీ బయటికి చెప్పడం లేదు.ఇక ఈరోజు అనగా డిసెంబర్ 4 సోమవారం రాత్రి నుండి పెళ్లి వేడుకలు మొదలవుతాయట.

వీరి పెళ్లి మూడు రోజుల వేడుకగా చేసుకుంటున్నారని తెలుస్తోంది.

Telugu Ahimsa, Daggubati Rama, Daggubatisuresh, Prathyusha, Rana, Sri Reddy, Sri

అలాగే రేపు అనగా మంగళవారం మెహందీ,సంగీత్ వంటి ఫంక్షన్లు ఉంటాయట.అలాగే బుధవారం రోజు ఉదయాన్నే పెళ్లికూతుర్ని చేయడం వంటి కార్యక్రమాలతో పాటు బుధవారం రాత్రి 8:50 నిమిషాలకు దగ్గుబాటి అభిరామ్ ప్రత్యూష ఇద్దరు పెళ్లి పీటలెక్కబోతున్నట్టు సమాచారం.ఇక దగ్గుబాటి అభిరామ్ అహింస ( Ahimsa ) అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైనప్పటికీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇక ఈ మధ్యనే ఒక కొత్త బిజినెస్ కూడా అభిరామ్ స్టార్ట్ చేశారు.మరి అభిరామ్ శ్రీలంకలో పెళ్లి చేసుకోవడం గురించి నెట్టింట్లో చాలానే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇండియా లోని మంచి మంచి ప్రదేశాలను వదిలిపెట్టి శ్రీలంకలో అభిరామ్ పెళ్లి చేసుకోవడం ఏంటి అని కొంతమంది భావిస్తుంటే మరి కొంతమందేమో శ్రీ రెడ్డి (Sri Reddy) కి భయపడే అలా చేసుకుంటున్నారని కామెంట్లు పెడుతున్నారు.మరి అభిరామ్ పెళ్లి వార్తల గురించి దగ్గుబాటి ఫ్యామిలీ ఎప్పుడు అధికారికంగా ఈ విషయాన్ని బయట పెడుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube