టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నరేష్ ( Naresh ) ఒకరు.ఈయన ఒకానొక సమయంలో హీరోగా ఎన్నో సినిమాలలో నటించారు.
ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా నరేష్ ఎంతో బిజీగా ఉన్నారు.అయితే ఈయన సినీ కెరియర్ కంటే వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకున్నటువంటి నరేష్ పవిత్ర లోకేష్( Pavitra Lokesh ) తో ఈయన రిలేషన్ లో ఉన్నారు.
ఇలా వీరిద్దరు కూడా రిలేషన్ లో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని విషయం తెలియడంతో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి(Ramya Ragupathi) ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో మనకు తెలిసిందే.ఇలా ఈ వివాదం ద్వారా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు.అయితే ప్రస్తుతం ఈ వీటన్నింటికీ దూరంగా పవిత్ర లోకేష్, నరేష్ ఇద్దరు చాలా సంతోషంగా గడుపుతున్నారు.
తాజాగా వీరిద్దరు ఫిలిప్పీన్స్ ( Philipinns ) వెకేషన్ కి వెళ్లారు.ఫిలిప్పీన్స్ వెళ్లినటువంటి ఈ జంట అక్కడ సరదాగా గడుపుతూ ఉన్నటువంటి ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఇది వైరల్ అవుతున్నాయి.
ఫిలిప్పీన్స్ వెకేషన్ లో ఉన్నటువంటి పవిత్ర నరేష్ అక్కడహెలీకాప్టర్ ఐల్యాండ్‌లో ఎంజాయ్ చేశారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ నరేష్ ఒక వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. హెలీకాప్టర్ ఐల్యాండ్‌లోని అద్భుతాలను అన్వేషించాం.ఫిలిప్పీన్స్ సముద్రంలో పవిత్రతో కలిసి చేసిన సాహస యాత్రలో ఆ సముద్రంలో దాగివున్న రత్నాన్ని కనుగొన్నాం.అలాగే ఎల్ నిడో ఐల్యాండ్‌లో కూడా పర్యటించాం.లగూన్ బీచ్ అందం వెనకున్న రహస్యాన్ని కనుగొన్నాము.
ఇలా మేమిద్దరం కలిసి చేసినటువంటి ఈ ప్రయాణంలో మరెన్నో జ్ఞాపకాలను చేర్చుకున్నామని ఈ జ్ఞాపకాలకు వెలకట్టలేము అంటూ ఈ పోస్ట్ చేసినటువంటి నరేష్ మరి కొంత సమయానికి ఒక వీడియోని కూడా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ అలాగే నరేష్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.