అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ( Joe Biden )మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) విమర్శలు గుప్పించారు.అమెరికన్ ప్రజాస్వామ్యాన్ని బైడెన్ నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు ట్రంప్.శనివారం జరిగిన ఓ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ.
బైడెన్‌ను ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా చూడాలని పిలుపునిచ్చారు.తనకు వ్యతిరేకంగా బైడెన్ ఫెడరల్ న్యాయవ్యవస్ధను దుర్వినియోగం చేస్తున్నాడని, తనపై నాలుగు నేరారోపణలు చేస్తున్నాడని ట్రంప్ మండిపడ్డారు.
నియంతలాగా రాజకీయ ప్రత్యర్ధులపై అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.బైడెన్ అతని వామపక్ష రాడికల్ మిత్రులు ప్రజాస్వామ్యానికి మిత్రపక్షాలుగా నిలబడటానికి ఇష్టపడతారని ట్రంప్ దుయ్యబట్టారు.
జో బైడెన్ అమెరికన్ ప్రజాస్వామ్యాన్ని రక్షించేవాడు కాదు.నాశనం చేసేవాడంటూ మాజీ అధ్యక్షుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాను వైట్‌హౌస్‌లో మళ్లీ అడుగుపెడితే బైడెన్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.అయితే బైడెన్ ప్రజాస్వామ్యానికి ముప్పు అంటూ రెండు ఉదారవాద సంస్థలు దాఖలు చేసిన వ్యాజ్యాలను ప్రస్తావిస్తూ ట్రంప్ రెచ్చిపోయారు.అంతర్యుద్ధ కాలం నాటి రాజ్యాంగ నిబంధన ప్రకారం ‘‘తిరుగుబాటులో నిమగ్నమైన’’ వారిని బైడెన్ నిషేధించారంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.అయితే ఇప్పటి వరకు వేసిన దావాలన్నీ విఫలమవ్వగా.బైడెన్‌కు వాటిలో ప్రమేయం లేదు.కానీ అతనికి మద్ధతు ఇచ్చే డెమొక్రాటిక్ దాతలు కూడా దావాలు వేసే ఉదారవాద సమూహాలకు నిధులు సమకూర్చడంలో సహయం చేస్తున్నారు.
అంతిమంగా ఇది బైడెన్‌ను నిందించడానికి ట్రంప్‌కు ఆయుధంలా దొరికింది.
అయితే ట్రంప్ పలుమార్లు నియంతలపై ప్రశంసలు కురిపించిన విషయాన్ని డెమొక్రాట్లు గుర్తుచేస్తున్నారు.డ్రగ్ డీలర్లను వేగంగా ఉరితీసినందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్( Chinese President Xi Jinping ), చైనా నేర న్యాయవ్యవస్ధను ఆయన ప్రశంసించారు.ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తనను ఇష్టపడుతున్నారని ప్రగల్బాలు పలికి ట్రంప్ నవ్వుల పాలయ్యారు.
అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో తనను తాను రక్షించుకోవడానికి ఆయన అప్పట్లో ప్రయత్నించారు.అణ్వాయుధాలు కలిగి వున్న వ్యక్తులతో సత్సంబంధాలు కలిగి వుండటం మంచిదని వ్యాఖ్యానించారు.తాజాగా తన ప్రసంగం అంతటా .2020 అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోయానని , తన ఓట్లు దొంగిలించబడ్డాయని వ్యాఖ్యానించారు .ఆయన అప్పట్లో దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానాలు కొట్టివేశాయి కూడా.అయినప్పటికీ ట్రంప్ తీరులో ఏ మార్పు రాలేదు.