సెమీఫైనల్ మ్యాచ్ లో సిరాజ్ ఆడతాడా..లేదా..? ఫ్యాన్స్ లో ఉత్కంఠ..!

వన్డే వరల్డ్ కప్ టోర్నీలో వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న భారత జట్టుకు ఊహించని గట్టి షాక్ తగిలింది.తాజాగా జరిగిన భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ లో భారత జట్టు స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్( Mohammed Siraj ) క్యాచ్ పట్టుకోవడం కోసం వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లి, బంతి ఎక్కడ పడుతుందో సరిగ్గా డిసైడ్ చేయలేకపోయాడు.

 Will Mohammed Siraj Play Semifinal Against Nz After Being Hurt In Netherlands Ma-TeluguStop.com

సరిగ్గా బ్యాలెన్స్ గా నిలబడకుండా వంగి బంతిని అందుకునే క్రమంలో, బంతి చేతుల్లోంచి చేజారి బలంగా గొంతు పై పడింది.

దీంతో చాలా ఇబ్బంది పడిన సిరాజ్ మైదానం వీడాల్సి వచ్చింది.

బౌండరీ బయట కాసేపు ఫిజియోథెరపీ చికిత్స చేసుకొని మళ్లీ మైదానంలోకి వచ్చి బౌలింగ్ చేయడంతో భారత క్రికెట్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.అయితే మ్యాచ్ మధ్యలో గాయం అవడంతో మళ్లీ రిటర్న్ వచ్చాడు.

కానీ న్యూజిలాండ్ తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్లో( Semifinal Match ) సిరాజ్ ఆడతాడా.లేదా అనే ఉత్కంఠ ఫ్యాన్స్ లో నెలకొంది.

Telugu Cricket Cup, Jasprit Bumrah, Mohammed Siraj, Netherlands, Rohit Sharma, S

తొలి పవర్ ప్లే లో భారత జట్టుకు బ్రేక్ త్రూ ఇవ్వడంలో బుమ్రా తో( Bumrah ) కలిసి సిరాజ్ కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు.సెమీస్ లో సిరాజ్ ఆడకపోతే భారత జట్టుకు కచ్చితంగా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.ఒకవేళ సిరాజ్ సెమీస్ లో ఆడకపోతే.భారత జట్టు ప్రత్యర్థి జట్టు న్యూజిలాండ్ ను( New Zealand ) కట్టడి చేయడం చాలా కష్టంగా మారే అవకాశం ఉంది.

గాయం తగిలిన కాసేపటి తరువాత సిరాజ్ మళ్లీ మైదానంలోకి వచ్చి బౌలింగ్ చేయడంతో.

Telugu Cricket Cup, Jasprit Bumrah, Mohammed Siraj, Netherlands, Rohit Sharma, S

నవంబర్ 15న జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆడే అవకాశం కనిపిస్తోంది.ఈ విషయంలో టీం మేనేజ్మెంట్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.బహుశా సెమీఫైనల్ మ్యాచ్ కు మరో రెండు రోజుల సమయం ఉన్నందున.

అంతలోపు సిరాజ్ పూర్తిస్థాయిలో కోలుకొని సెమీస్ లో ఆడే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.ఏం జరుగుతుందో తెలియాలంటే ఇంకొంత సమయం వేచి ఉండాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube