తెలంగాణ రాజకీయాలు ఎన్నికల వేళ హాట్ హాట్ గా సాగుతున్నాయి.ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసిఆర్ టార్గెట్ గా ప్రధాన ప్రత్యర్థి పార్టీల నేతలు వేస్తున్న ఎత్తులు ఆసక్తికరంగా మారుతున్నాయి.
కేసిఆర్ ఈసారి గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈసారి గజ్వేల్ లో కేసిఆర్ ను ఓడించేందుకు బీజేపీ నేత ఈటెల కాలు దువ్వుతున్నారు.
సాధారణంగా హుజూరాబాద్ లో మాత్రమే పోటీ చేసే ఇస్తే ఈసారి పంతంతో కేసిఆర్ తో ఢీ కొడుతున్నారు.కేసిఆర్ కు పోటీగా గజ్వేల్ లో పోటీ చేస్తూ గులాబీ బాస్ ను ఒడిస్తానని శపథం చేస్తున్నారు.
అయితే పర్వతం లాంటి కేసిఆర్ ను ఢీ కొట్టి ఈటెల గెలవగలరా ? అనే సందేహాలు చాలమందిలో ఉన్నాయి.ఈ నేపథ్యంలో తన గెలుపు కోసం ఈటెల సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.
తాను బిఆర్‌ఎస్ లో ఉన్నప్పుడూ ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, తనను తీవ్రంగా భాదించారని ఉద్వేగ భరితమైన ప్రసంగాలు చేస్తూ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.అందుకే కేసిఆర్ ను ఓడించేందుకే గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారు.
ముఖ్యంగా బిఆర్‌ఎస్ లో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా ఉపయోగించుకొని గజ్వేల్ లో కేసిఆర్ కు చెక్ పెట్టాలనేది ఈటెల ప్లాన్ గా తెలుస్తోంది.
అందుకే ప్రతిసారి తన ప్రసంగాల్లో బిఆర్‌ఎస్ తనకు చేసిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు ఈటెల.అయితే కేసిఆర్ ను ఓడించేందుకు ఈ సెంటిమెంట్ అస్త్రం ఎంతవరకు ఫలిస్తుందనేది అనుమానమే.అందుకే నియోజిక వర్గంలో గ్రాండ్ లెవెల్ లో కూడా ఈటెల గట్టిగానే పెట్టరాట.
కేసిఆర్ కు వ్యతిరేకంగా అసంతృప్త బిఆర్‌ఎస్ నేతలను తనకు మద్దతుగా నిలుపుకునేందుకు ఈటెల శతవిధాల ప్రయత్నిస్తున్నట్లు టాక్.ఇప్పటికే చాలమంది బిఆర్‌ఎస్ నేతలను ఈటెల తనవైపు తిప్పుకున్నారట.
వారి ద్వారా కేసిఆర్ పై వ్యతిరేకత మరింత పెంచేలా ఈటెల ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.మరి ఈటెల ప్రణాళికలు గులాబీ బాస్ కు ఎంతవరకు చెక్ పెడతాయో చూడాలి.