అసెంబ్లీ అభ్యర్థులకు తిండి కష్టాలు ! భారీ ఖర్చు తో బెంబేలు 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana Assembly Elections ) పోటీ చేయబోతున్న అభ్యర్థులకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి .ఒకవైపు ఎన్నికల్లో ప్రత్యర్థులను ఢీ కొట్టి గెలవడం ఎలా అనేదానికైనా దృష్టి పెట్టి భారీగా ఎన్నికల ప్రచారం( Elections Campaign ) చేపడుతున్నాయి.

 Telangana Assembly Elections Candidates Spending Huge Money On Food Details, Brs-TeluguStop.com

గ్రామాలు ,మండలాల వారిగా పర్యటన చేస్తూ, నియోజకవర్గాల్లో కలియ తిరుగుతున్నారు .ఇప్పటికే దాదాపుగా అన్ని పార్టీలు చాలా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా జనాల్లోకి వెళ్తున్నారు.అసలు ఎన్నికలు అంటేనే భారీగా సొమ్ములు ఖర్చు చేయాల్సి ఉంటుంది .ప్రత్యర్థులపై పట్టు సాధించాలంటే వెంట మంది మార్బలాన్ని తిప్పుకోవాల్సిందే.దీంతో రోజువారి ఖర్చులు( Daily Expenses ) భారీగా ఉండడంతో , అభ్యర్థులు అప్పుడే బెంబేలెత్తిపోతున్న పరిస్థితి.

Telugu Assembly Candis, Brs, Congress, Telangana-Politics

ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల నుంచి పట్టణాల వరకు రోజు పెద్ద సంఖ్యలో సామూహిక భోజనాలను( Communal Meals ) ఏర్పాటు చేస్తున్నారు.ప్రతి రోజు అన్ని గ్రామాల్లో కలియ తిరుగుతూ ప్రచారం నిర్వహించే వారికి నాయకులే భోజనాలు సమకూరుస్తున్నారు.దీంతో ప్రతి గ్రామం, పట్టణల్లో నిత్యం భోజనాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికే వీటి కోసం హోటళ్లు, క్యాటరింగ్ నిర్వాహకులు పెద్ద ఎత్తున సరుకులు కొని నిలువ చేసుకున్నారు.అలాగే మహారాష్ట్ర , ఛత్తీస్ ఘడ్ ల  నుంచి భారీ కూరగాయలు, ఉల్లి బంగాళదుంప వంటి వాటిని దిగుమతి చేసుకున్నారు. 

Telugu Assembly Candis, Brs, Congress, Telangana-Politics

ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు భోజనాలను క్యాటరింగ్ హోటళ్లకు( Catering Hotels ) కాంట్రాక్ట్ ఇవ్వగా,  కొంతమంది సొంతంగానే వండిస్తున్నారు. అయితే ఈ ఖర్చు భారీగా ఉండడంతో ఎన్నికల వరకు అయ్యే ఖర్చును తలుచుకుని బెంబేలెత్తుతున్నారు.ప్రస్తుతం భారీగా ఎన్నికల ప్రచారం చేపడుతున్న నేపథ్యంలో రోజుకు వేలాదిమందికి భోజనాలు సమకూర్చేందుకు లక్షలు ఖర్చవుతుంది .పోలింగ్ తేదీ వరకు అయ్యే ఖర్చును తలుచుకుని టెన్షన్ పడిపోతున్నారు.భోజనాలతో పాటు,  తమ వెంట తిరిగే వారికి వారికి సొమ్ములు ఖర్చు పెట్టాల్సి పరిస్థితి ఏర్పడిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube