సూర్యాపేట జిల్లా:ఎన్నికలనిబంధనల ( Election Regulations )నేపథ్యంలో సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంబరాఖత్ గూడెం రోడ్డులోనడిగూడెం( Nadigudem) ఎస్ఐ ఎం.ఏడుకొండలు అధ్వర్యంలో గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో నల్లగొండ జిల్లా( Nalgonda District ) మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామానికి చెందిన ఢీకొండా రంగయ్య తండ్రి బుచ్చయ్య కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.8 లక్షలు తీసుకెళ్తుండగా డబ్బునుస్వాధీనపరచుకొని ఫ్లయింగ్ స్క్వాడ్( Flying squad ) కి అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు.తనిఖీలో పోలీస్ సిబ్బంది జగన్నాథం,సక్రు నాయక్,నాగరాజ్ వీరబాబు పాల్గొన్నారు.