మామూలుగా 3D ఎఫెక్ట్స్‌తో సినిమా చూస్తేనే ఆ అనుభూతి అదిరిపోతుంది.ఇక 5D ఎఫెక్ట్( 5D Effect ) దానికి మించిన విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తూ మనుషులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది.
ఈ టెక్నాలజీ 3D విజువల్స్ డైనమిక్ సీటింగ్, నీరు, గాలి, మంచు, పొగ, అగ్ని వంటి పర్యావరణ ప్రభావాలను మిళితం చేసే ఇమ్మర్సివ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తుంది.స్క్రీన్‌పై యాక్షన్‌లో తాము భాగమైన అనుభూతిని ప్రేక్షకులకు కలిగించేలా ఇది రూపొందించబడింది.
5D సినిమాలు( 5D Movies ) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అవుతున్నాయి.ఈ ఫిలిమ్స్ సాధారణంగా 5 నుంచి 15 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్‌లుగా ఉంటాయి.
ఎందుకంటే, ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉంటాయి, వాటిని 2-3 గంటలు చూస్తే మతి పోవడం ఖాయం.అందుకే 15 నిమిషాల్లోనే ఈ సినిమాలను ముగిస్తుంటారు.అప్పటికే ఆ అనుభూతి నిజ జీవితంలో( Real Life ) కలిగినంతగా ఉంటుంది.అయితే 5D ఎఫెక్ట్ ఎంతలా మనుషులపై ప్రభావం చూపుతుందో కళ్ళకు కట్టినట్లు చూపించే ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒక వైరల్ వీడియో షేరింగ్ ఎక్స్ పేజీ సీసీటీవీ ఇడియట్స్ (@CCTVidiots ) తాజాగా ఈ వీడియోను షేర్ చేసింది.ఫైర్ ఎఫెక్ట్‌ను 5Dలో( 5D Fire Effect ) చూస్తే ఎలా ఉంటుందో చూడండి అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ జోడించింది.ఆ వీడియో ఓపెన్ చేస్తే మనకు ఒక భవనంలో మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడినట్లు కనిపించడం చూడవచ్చు.ఆ సౌండ్ కూడా మంట ఆ భవనంలో నిజంగానే మొదలైందేమో అన్నంత రియల్లిస్టిక్ గా ఉంది.
మన కళ్ళను మనం నమ్మలేనంత మాయాజాలంగా అది అనిపించింది.ఆ ఎఫెక్ట్ ఎంత వాస్తవికంగా ఉందో మీరు వైరల్ వీడియోలో చూడవచ్చు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా అబ్బరు పడుతున్నారు.ఇలాంటిది లైఫ్ లో ఒక్కసారైనా ట్రై చేయాలని కామెంట్లు చేస్తున్నారు.అయితే ఒకవేళ నిజంగానే ఆ భవనంలో ఫైర్ స్టార్ట్ అయ్యుంటే, అది 5D అనుకుని ఆడియన్స్ పొరపాటు పడితే ఎంత ప్రమాదం అని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు.ఈ వీడియోకు ఇప్పటికే మూడు లక్షల 50 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
దీనిని మీరు కూడా చూసేయండి.