నాలుగు నెలల గర్భవతి అన్న కనికరం లేకుండా కట్టుకున్న భార్యను గొంతు కోసి దారుణం చంపడమే కాకుండా ఆపై ఆమె మృతదేహాన్ని తగులబెట్టిన 51 ఏళ్ల భారత సంతతి వ్యక్తికి కెనడాలో( Canada ) 17 ఏళ్ల తర్వాత పెరోల్ లభించింది.బ్రిటీష్ కొలంబియాలోని సర్రే నగరానికి చెందిన ముఖ్తియార్ సింగ్ పంఘాలి.
( Mukhtiar Singh Panghali ).తన భార్య మంజిత్‌ను ఇంట్లోనే దారుణంగా హతమార్చాడు.ఈ నేరానికి గాను 2011లో అతనికి కోర్టు జీవిత ఖైదు విధించింది.15 ఏళ్ల పాటు నేరస్తుడికి ఎలాంటి పెరోల్ మంజూరు చేయరాదని తీర్పులో స్పష్టం చేసినట్లు సీబీఎస్ న్యూస్ ఛానెల్ నివేదించింది.

2006 అక్టోబర్‌లో డెల్టాలోని రాబర్ట్స్ బ్యాంక్( Roberts Bank in Delta ) సమీపంలోని బీచ్‌లో 31 ఏళ్ల మంజిత్( Manjit ) మృతదేహాన్ని కాలిపోయిన స్థితిలో పోలీసులు కనుగొన్నారు.తన భార్య తప్పిపోయిందని ముఖ్తియార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐదు రోజులకు ఈ ఘటన జరిగింది.అనంతరం పోలీసుల దర్యాప్తులో ముఖ్తియారే నేరస్తుడని తేలడంతో 2007లో పంఘాలిని అరెస్ట్ చేశారు .ఈ నేపథ్యంలో పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోగా..అతనికి 2021లో ఏడాది పాటు పెరోల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.ఈ పిటిషన్‌ను తాజాగా పరిశీలించిన కెనడా పెరోల్ బోర్డ్ పంఘాలీకి పూర్తి స్థాయి పెరోల్ మంజూరు చేసింది.ఇదే సమయంలో సమాజానికి ఎలాంటి ప్రమాదం కలిగించకూడదని పేర్కొంది.

పంఘాలి మద్యపానానికి దూరంగా వుండాలని, మహిళలతో వున్న లైంగిక, లైంగికేతర సంబంధాలను పెరోల్ అధికారికి తప్పనిసరిగా నివేదించాల్సిందిగా బోర్డు షరతులు విధించింది.మంజిత్ కుటుంబాన్ని సంప్రదించకూడదని స్పష్టం చేసింది.కాగా.2014లో బ్రిటీష్ కొలంబియా సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి పంఘాలి దంపతుల కుమార్తె మాయ పంఘాలికి 6,00,000 డాలర్లను ఇప్పించారు.మాయా బాగోగులను ప్రస్తుతం మంజిత్ సోదరి చూసుకుంటున్నారు.మంజిత్ మరణించే సమయానికి మాయా నాలుగేళ్ల బాలిక.
.