వేములవాడ పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, పాలకవర్గ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, వేములవాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు,నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి,ప్రతాప రామకృష్ణ ,పుల్కం రాజు,నాయకులు,పట్టణ పురప్రముఖులు, ప్రజలు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ రామతీర్థపు మాధవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పురపాలక సంఘం వేములవాడ వారి ఆధ్వర్యంలో దుర్గా అమ్మవారిని ఊరేగింపుగా తీసుకవెళ్లి మూల వాగులో ప్రతిష్టించడం జరుగుతుందని ఈ సందర్భంగా వేములవాడ పట్టణ మహిళా సోదరీమణులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ పండుగ ను మిగతా పట్టణాలలో తొమ్మిది రోజులకు జరుపుకుంటే మరి మన వేములవాడ పట్టణంలో ప్రత్యేకంగా ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకుంటారని,పూలను బతుకమ్మగా పేర్చి పూలను పూజించే గొప్ప సాంప్రదాయం తెలంగాణ ప్రజలది అని మరి మిగతా పట్టణాలలో తొమ్మిది రోజులకు సద్దుల బతుకమ్మ వేడుకలు జరగడం వల్ల ఇక్కడున్న మహిళలు పుట్టినింటా, మేట్టినింట సద్దుల బతుకమ్మ పండుగ ను ఎంతో సంతోషంగా జరుపుకుంటారని ఈరోజు సాయంత్రం జరిగే బతుకమ్మ వేడుకల ను మహిళలందరూ ఘనంగా జరుపుకొని మూల వాగులో బతుకమ్మలను నిమర్జనం చేసుకోవాలని వారన్నారు.