మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun tej )లావణ్య త్రిపాఠిల ( Lavanya Tripati ) వివాహం త్వరలోనే ఎంతో ఘనంగా జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే వీరి వివాహం ఇటలీలో జరగబోతుందని తాజాగా ఉపాసన లీక్ చేసినప్పటికీ ఇంకా ఈ విషయం గురించి అధికారకంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి వారి సమక్షంలో వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు.జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా జరిగింది అయితే లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్( Free Wedding Celebrations ) కూడా మొదలయ్యాయి.
ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బహుశా వీరి వివాహం ఈ నెల చివరిలోనూ లేకపోతే వచ్చేనెల మొదటి వారంలో ఉండబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కానున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ లావణ్య గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి.అయితే త్వరలోనే లావణ్య త్రిపాఠి తన జీవితంలోకి రాబోతున్నటువంటి నేపథ్యంలో వరుణ్ తేజ్ ఆమెకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారట.ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే… ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్న తర్వాత వారం రోజులు కూడా కలిసి ఉండకుండా వెంటనే వారి సినిమా షూటింగ్ పనులలో బిజీగా మారిపోతున్నారు.
ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ కూడా ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయ్యారు.దీంతో ఈయన పెళ్లి తర్వాత వెంటనే షూటింగ్ వెళ్లకుండా తన భార్యతో కలిసి టైమ్స్ స్పెండ్ చేయాలని భావించారట.ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత దాదాపు నెల రోజులపాటు సినిమా షూటింగులు అన్నింటికి బ్రేక్ ఇచ్చి తన భార్యతో కలిసి వెకేషన్ వెళ్లడం కోసం అన్ని ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది.ఇలా తన భార్యతో కలిసి నెల రోజులపాటు వివిధ దేశాలకు వెళుతూ తమ లైఫ్ ఎంజాయ్ చేయాలని భావించారట.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వరుణ్ చాలా రొమాంటిక్ అంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.