ప్రతి రోజు పూజలు చేసిన సరైన ఫలితం రావడం లేదా.. అయితే ఈ తప్పులు చేస్తున్నారేమో.

మన దేశంలో చాలా మంది ప్రజలు ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు.పూజలు( Puja ) మతపరమైన ఆచారాలు పాటించడం వల్ల కూడా చాలా మంది తమ జీవితాలనుంచి కొన్ని సమస్యలను దూరం చేసుకుంటూ ఉంటారు.

 If You Do Puja Every Day, You Are Not Getting The Right Result.. But You Are Do-TeluguStop.com

మరి కొంత మంది ఎప్పుడు కొన్ని రకాల సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు.ఎన్ని పూజలు చేసినా తమ సమస్యలు ఎందుకు దూరం అవ్వడం లేదని బాధపడుతూ ఉంటారు.

అయితే ఈ ప్రశ్నకు సమాధానం పొందాలంటే పూజ సమయంలో ఏమైనా తప్పులు చేస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయాలని పండితులు చెబుతున్నారు.పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు.

Telugu Abhishekam, Devotional, Idols, Puja-Latest News - Telugu

అందువల్ల మనం చేసే పూజ యొక్క ఫలితం రాకుండా ఉంటుంది.ఇంట్లో ఉన్నటువంటి దేవుని గదిలో విపరీతమైన దోషం ఉంటే పూజకు తగిన ఫలితం లభించదు.పూజ సమయంలో శుభ్రమైన దుస్తులను ధరించాలి.పరిశుభ్రత కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి.క్రమం తప్పకుండా శుభ సమయంలోనే పూజలు చేయాలి.ఈ నియమాన్ని పాటించకపోతే పూజ నుంచి ఎటువంటి ప్రయోజనాలు లభించవు.

ఇంట్లో పూజంచే స్థలం అందరూ ఎక్కువగా తిరిగే స్థలంగా ఉండకూడదు.పూజ చేసి ధ్యానం( Meditation ) చేసుకోవడానికి ఏకాంతంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి.

ఇంట్లో పూజించే దేవతల విగ్రహాలను, చిత్రాలను పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

Telugu Abhishekam, Devotional, Idols, Puja-Latest News - Telugu

పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని పూజ అయిన వెంటనే తీసి మర్చిపోకుండా ప్రసాదంగా స్వీకరించాలి.నైవేద్యాన్ని అలాగే దేవుడు దగ్గర వదిలేయడం ఏవిధంగాను మంచిది కాదు.అలాగే దేవుడికి పచ్చి పాలను నైవేద్యం పెట్టకూడదు.

కాచి చల్లార్చిన పాలను అభిషేకానికి ( Abhishekam ) ఉపయోగించకూడదు.పూజకు ఉపయోగించిన పూలను ఎక్కడపడితే అక్కడ పాడేయకూడదు.

పగిలిపోయిన దేవుని పటాలను ఉపయోగించకూడదు.అలాగే ఎత్తైన విగ్రహం పూజకు ఉపయోగించకూడదు.

ఇలా పూజకు కొన్ని నియమాలను తెలుసుకొని పాటిస్తే జీవితంలో శ్రేయస్సు, ఐశ్వర్యం మీ సొంతమవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube