అక్కడ రోరింగ్ రెస్పాన్స్.. ప్రభాస్ కెరీర్ లో సెకండ్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా 'సలార్'..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘‘సలార్”( Salaar ).ఈ సినిమాకు రిలీజ్ అయ్యిన అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుంది.

 Salaar part 1 Ceasefire' us box Office Collection, Salaar Usa Collection,-TeluguStop.com

బాహుబలి తర్వాత ప్రభాస్ మరో హిట్ అనేది అందుకోలేదు.దీంతో హిట్ కోసం ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురు చూసారు.

ఇక ఎట్టకేలకు సలార్ తో అయితే డార్లింగ్ హిట్ తన ఖాతాలో వేసుకోవడంతో మళ్ళీ పూర్వ వైభవం వచ్చినట్టే అని చెప్పాలి.దీంతో బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ ప్రభంజనం మాములుగా లేదు.4 రోజుల్లోనే భారీ కలెక్షన్స్ కొల్లగొట్టి రికార్డులను తుడిచిపెట్టేస్తున్నాడు.

‘సలార్”( Salaar ) మొన్న శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా ఇక ఎక్కడ తగ్గకుండా దూసుకు పోతుంది.మరి ఇక్కడే కాదు యుఎస్ మార్కెట్ లో కూడా డార్లింగ్ ప్రభంజనం మాములుగా లేదు.4 రోజుల్లోనే ఏకంగా 6.3 మిలియన్ డాలర్స్ మార్క్ క్రాస్ చేసినట్టు తాజాగా యుఎస్ డిస్టిబ్యూటర్స్ తెలిపారు.

ఇది ప్రభాస్ కెరీర్ లోనే రెండో బిగ్గెస్ట్ గ్రాసర్ సినిమాగా రోరింగ్ రెస్పాన్స్ తో అదరగొడుతుంది.మొత్తానికి సలారోడి దెబ్బకు బాక్సాఫీస్ అల్లాడిపోతుందనే చెప్పాలి.కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటించగా.

హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మించారు.అలాగే రవి బసృర్ సంగీతం అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube