మీ ఫోన్ లో మొబైల్ డేటా అదుపు చేసుకోవాలనుకుంటున్నారా..?! అయితే ఇలా ఫాలో అయిపోండి..!

మి మొబైల్ ఫోన్ లో త్వరగా మొబైల్ డేటా అయిపోతుందా ?! ఇలా మొబైల్ డేటా అయిపోవడం వల్ల మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారా ? అయితే మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా మీ మొబైల్ డేటా వినియోగం చాలా వరకు తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి.నిజానికి మన మొబైల్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకున్న కొన్ని అప్లికేషన్స్ మాత్రమే భారీ మొత్తంలో మొబైల్ డేటాను వినియోగించుకుంటూ ఉంటాయి.

 Mobile Data Saver, Internet Data, Network Settings, Applications Usage, Play Sto-TeluguStop.com

ఇందుకు ముందుగా మీరు ఆండ్రాయిడ్ ఫోన్ లో కొన్ని సెట్టింగ్స్ మార్చుకుంటే చాలు.ఇలా సెట్టింగ్స్ చేసుకోవడానికి ముందుగా సెట్టింగ్స లోకి వెళ్లి నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్అనే ఆప్షన్ ను ఎంచుకున్న అనంతరం అక్కడ డేటా సేవర్ అనే ఆప్షన్ ను మనం సెలెక్ట్ చేసుకోవాలి.

ఇలా సెలెక్ట్ చేసుకున్న అనంతరం మీ మొబైల్ ఫోన్ లోని కొన్ని అప్లికేషన్స్ సర్వర్ నుండి మీ ఫోన్ లోకి డేటా వచ్చే దశలోనే డేటా కంప్రెస్ చేయబడిన తక్కువ డేటాను వినియోగించుకునే విధంగా జాగ్రత్త వహిస్తాయి.

అలాగే యాప్ డేటా యూసేజ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే వెంటనే మన మొబైల్ ఫోన్లో స్క్రీన్ మీద ఇన్స్టాల్ చేయబడ్డ అన్ని అప్లికేషన్స్ ఎంత మొత్తంలో డేటా వినియోగిస్తున్నాయన్న సంగతి మనం తెలుసుకోవచ్చు ఇందులో కూడా బ్యాక్ గ్రౌండ్ మరియు ఫోర్ గ్రౌండ్ అనే రెండు విభాగాలు ఉంటాయి.

ఇందులో మనం బ్యాక్ గ్రౌండ్ డేటా ను డిసేబుల్ చేసుకోవడం ద్వారా మనకు అవసరమైనప్పుడు సంబంధిత అప్లికేషన్స్ మొబైల్ డేటా వినియోగించుకోకుండా పరిమితిని విదించుకోవచ్చు.

అదే మొబైల్ ఫోన్ లో అన్ రిస్టిక్ టెడ్ డేటా అనే ఆప్షన్ ఉన్నట్లయితే ఈ ఆప్షన్ ద్వారా కూడా డిసేబుల్ చేసే మరింత డేటాను మీరు సేవ్ చేసుకోవచ్చు.

అలాగే డేటా సేవ్ చేసుకోవడానికి మరొక పద్ధతి ఏమిటంటే మన గూగుల్ ప్లే స్టోర్ లో లభించే నో రూట్ ఫైర్వాల్ అనే అప్లికేషన్ మన మొబైల్ లో ఉపయోగించడం వల్ల అప్లికేషన్స్ ను పూర్తిస్థాయిలో మొబైల్ డేటా డిసేబుల్ చేసే విధంగా మనం ఆప్షన్ ను సెట్ చేసుకోవచ్చు.ఇలా పలు పద్ధతులు పాటించి మనం భారీ మొత్తంలో మొబైల్ డేటాను సేవ్ చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube