పవన్ కళ్యాణ్ కొత్త లుక్.. అందరూ ఫిదా!

టాలీవుడ్ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత దాదాపు మూడేళ్లు అవుతుండగా.ప్రస్తుతం ఏకంగా వరుస ఆఫర్ లను‌ సొంతం చేసుకున్నాడు.

 Pawan Kalyan New Look Photo Goes Viral, Pawan Kalyan, Vakeel Saab, New Look, Tol-TeluguStop.com

సినిమా షూటింగ్ లలో విశ్రాంతి లేకుండా పాల్గొంటున్నాడు.అటు రాజకీయ పరంగా ఇటు సినీ ఇండస్ట్రీ పరంగా పవన్ కళ్యాణ్ సరిసమాన బాధ్యతను వహిస్తున్నాడు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా గత ఏడాదే విడుదల కావాల్సింది.కానీ కరోనా సమయం వల్ల ఆలస్యం కావడంతో ఏప్రిల్ 9న విడుదల చేయనున్నారు.

ఇక ఈయన సినిమాల కోసం అభిమానుల ఎదురు చూపులు మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయి.ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గెటప్ మాత్రం అందర్నీ ఫిదా చేయగా.

ప్రస్తుతం ఆయన ఫోటో వైరల్ గా మారింది.

కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్.

తన లుక్ పై ఎటువంటి దృష్టి పెట్టకపోయేసరికి మొత్తం జుట్టు, గడ్డం పెంచుకోవడమే కాకుండా శరీర బరువును కూడా పెంచుకున్నాడు.ఇక ప్రస్తుతం సినిమాల అవకాశాలు ఎక్కువగా ఉండటంతో తన లుక్ పై కాస్త దృష్టి పెట్టాడు.

తాజాగా పవన్ కళ్యాణ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటోను షేర్ చేశాడు.అందులో పవన్ బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తులు ధరించి సైడ్ లుక్ తో కాస్త సన్నగా కనిపిస్తూ ఓ చిరునవ్వు ఇస్తూ కనిపిస్తున్నాడు.

ఈ ఫోటో ను చూసిన అభిమానులు పవన్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘అయ్యప్పన్ కోషియుమ్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా మరో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube