కోబ్రాతో విక్రమ్.. లుక్ అదిరిపోయింది!

సినిమాలలో విభిన్న పాత్రలో నటించడానికి కేరాఫ్ అడ్రస్ నటుడు విక్రమ్ అని చెప్పవచ్చు.విక్రమ్ కొత్తగా సినిమాలలో నటిస్తున్నారంటే ఏదైనా కొత్త పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారని అర్థమవుతుంది.

 Cobra Second Look,cobra Movie,vikram,irfan Pathan, Actor Vikram, Cobra, Seven Sc-TeluguStop.com

విక్రమ్ నటించిన ప్రతి సినిమాలో ఒక విభిన్న పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు.ఈ తరహాలోనే విక్రమ్ తాజాగా కోబ్రా అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందుకు సంబంధించిన సెకండ్ లుక్ ను సెవెన్ స్క్రీన్ స్టూడియో విడుదల చేసింది.

ఈ లుక్ లో విక్రమ్ గజిబిజి జుట్టుతో కనిపించాడు.

అంతేకాకుండా ఆ జుట్టులో మనకు మ్యాథమెటికల్ ఫార్ములాలు కనిపిస్తాయి.ఈ పోస్టర్ లో ఎన్నో అంకెలు అతని మెదడులో నుంచి బయటకు వస్తున్నట్లు చూపించారు.

అంతేకాకుండా ప్రతి సమస్యకు ఒక గణిత పరిష్కారం ఉంటుందనే క్యాప్షన్ కూడా జోడించారు.తాజాగా విడుదలైన విక్రమ్ కోబ్రా సెకండ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకొని ఈ సినిమాపై అంచనాలను పెంచుతుంది.

కోబ్రా సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఇప్పటికే థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తుంది.ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను రష్యాలో షూటింగ్ కోసం చిత్రబృందం రష్యా వెళ్లి లాక్ డౌన్ కారణంగా తిరిగి ఇండియా చేరుకున్నారు.ప్రస్తుతం ఆ సన్నివేశాలను చెన్నైలోని చిత్రీకరిస్తున్నారు.ఈ చిత్రంలో హీరోగా విక్రమ్ నటించగా, ప్రతినాయకుడి పాత్రలో ప్రముఖ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నటిస్తున్నారు.వీరితో పాటు కేఎస్‌ రవికుమార్‌, శ్రీనిధి శెట్టి, మృణాలిని, కనికా, పద్మప్రియ, పలు కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ కోబ్రా చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు.తొందర్లోనే సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం ఆలోచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube