తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో శ్రీరామ్ సతీమణి.. హీరోయిన్ లా ఉందంటూ?

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో శ్రీరామ్( Sriram ) ఒకరు.

కొన్ని నెలల క్రితం పిండం అనే సినిమాతో శ్రీరామ్ మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు.

శ్రీరామ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తెలుగులో పలు సినిమాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.శ్రీరామ్ తెలుగు వ్యక్తే అయినా కోలీవుడ్( Kollywood ) ఇండస్ట్రీలో ఎక్కువగా సక్సెస్ సాధించడం గమనార్హం.తాజాగా శ్రీరామ్ తన సతీమణితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.2008 సంవత్సరం శ్రీరామ్ వివాహం జరిగింది.శ్రీరామ్ భార్య పేరు వందన( vandana ) కాగా ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

వాస్తవానికి శ్రీరామ్ అసలు పేరు శ్రీకాంత్ శ్రీరామ్ కాగా తెలుగులో శ్రీకాంత్ అనే పేరుతో మరో హీరో ఉండటంతో శ్రీరామ్ గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.శ్రీరామ్ తండ్రి స్వస్థలం చిత్తూరు( Chittoor ) కాగా తల్లిది తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం కావడం గమనార్హం.

శ్రీరామ్ భార్య ఫోటోలను చూసిన నెటిజన్లలో కొందరు ఆమె అచ్చం హీరోయిన్ లా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.ఒక షోలో శ్రీరామ్ కు సైతం తన భార్య అందం గురించి ప్రశ్న ఎదురైంది.మీ భార్య మీకంటే అందంగా ఉంటారని మీకెప్పుడైనా అసూయగా అనిపించిందా అనే ప్రశ్న ఎదురు కాగా అలా ఏం లేదని నేను చాలా గర్వంగా ఫీలవుతానని శ్రీరామ్ ఆ ప్రశ్నకు బదులిచ్చారు.

Advertisement

అలాంటి అందమైన అమ్మాయి ప్రేమను పొందినందుకు నన్ను చూసి కుళ్లుకుంటారు కదా అని శ్రీరామ్ వెల్లడించారు.శ్రీరామ్ కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని నెటిజన్లు సోషల్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.శ్రీరామ్ రెమ్యునరేషన్ లిమిటెడ్ గానే ఉందని తెలుస్తోంది.

పిండం సక్సెస్ సాధించడంతో శ్రీరామ్ భవిష్యత్తులో సైతం హర్రర్ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో నటిస్తారేమో చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు