అమెరికా: మహిళపై కాల్పులు.. మూడేళ్ల నాటి కేసులో భారత సంతతి పోలీస్ అధికారికి ఊరట

2019లో మహిళపై కాల్పులు జరిపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన అమెరికన్ పోలీస్ అధికారిని టెక్సాస్ కోర్ట్ నిర్దోషిగా ప్రకటించింది.మ్యాగీ బ్రూక్స్ (30) అనే మహిళను కాల్చి చంపిన కేసులో మూడేళ్లుగా రవీందర్ సింగ్ విచారణను ఎదుర్కొంటున్నారు.

 Indian-origin Officer Acquitted In Women's Fatal Shooting In America , Maggie Br-TeluguStop.com

జ్యూరీ తీర్పును వెలువరించిన తర్వాత టారెంట్ క్రిమినల్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది.నేరారోపణ మరోసారి ఎదుర్కొన్న పక్షంలో దీనిని గ్రాండ్ జ్యూరీకి తీసుకెళ్లే అవకాశం వుందని అటార్నీ కార్యాలయం తెలిపింది.2019లో బ్రూక్స్ మరణానికి సంబంధించిన వాస్తవాలను జ్యూరీ విన్నదని.సాక్ష్యుల వాంగ్మూలంతో ఆధారాలను విశ్లేషించారని అటార్నీ కార్యాలయం వెల్లడించింది.

ఈ నేపథ్యంలో రవీందర్ సింగ్‌ని నిర్దోషిగా విడుదల చేసినట్లు పేర్కొంది.తద్వారా నేర న్యాయవ్యవస్థలో జ్యూరీ తన కర్తవ్యాన్ని నెరవేర్చిందని అటార్నీ కార్యాలయం పేర్కొంది.

కాగా.2019 ఆగస్ట్‌లో ఆర్లింగ్‌టన్ పోలీసులు విడుదల చేసిన బాడీకామ్ ఫుటేజ్ ప్రకారం.షాపింగ్ సెంటర్‌కు సమీపంలో ఎవరో అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో అప్పుడు విధుల్లో వున్న రవీందర్ సింగ్ వెంటనే అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించాడు.

ఈ సందర్భంగా ఒక మహిళను ప్రశ్నిస్తుండగా.ఓ కుక్క అతని వైపుకు దూసుకొచ్చింది.

దీంతో దాని బారి నుంచి తప్పించుకునేందుకు గాను రవీందర్ కాల్పులు జరిపాడు.

Telugu America, Arlington, Indian Origin, Indianorigin, Maggie Brooks, Ravinder

అయితే ఓ బుల్లెట్ మహిళ ఛాతీలోకి దూసుకెళ్లింది.తీవ్ర గాయాలపాలైన ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ బాధితురాలు బ్రూక్స్ ప్రాణాలు కోల్పోయింది.

ఆమె మరణంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు.అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడేనంటూ రవీందర్‌పై హత్య కేసు నమోదు చేశారు.

దీంతో 2019 నవంబర్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఇన్వెస్టిగేషన్ కింద తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.అనంతరం సెప్టెంబర్ 2020లో టారెంట్ కౌంటీ గ్రాండ్ జ్యూరీ రవీందర్ సింగ్‌పై నిర్లక్ష్యపూరిత నరహత్య వంటి అభియోగాలు మోపారు.

అంతేకాదు జూలై 2021లో తమకు 2 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ ఫెడరల్ పౌర హక్కుల దావా వేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube