మాజీ మంత్రి శంకర్ నారాయణకు తృటిలో ప్రమాదం తప్పింది.శ్రీ సత్యసాయి జిల్లాలో మాజీ మంత్రి కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.
జిల్లాలోని గుడ్డంతండాకు మాజీ మంత్రి వెళ్తున్న సమయంలో జిలెటిన్ స్టిక్స్ తో దుండగుడు దాడికి యత్నించాడు.అయితే అది పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి యత్నించిన వ్యక్తి ఎవరన్న దానిపై విచారణ చేస్తున్నారు.