టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ మరియు బెయిల్ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది.ఇందులో భాగంగా చంద్రబాబు తరపున న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపిస్తున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవని లాయర్ దూబే కోర్టుకు తెలిపారు.కాస్ట్ ఎవాల్యూయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్ మెంట్ ధరను నిర్ధారించిందన్నారు.
అయితే ఆ కమిటీలో చంద్రబాబు లేరని ప్రమోద్ కుమార్ దూబే పేర్కొన్నారు.ఈ కేసులో చంద్రబాబుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని తెలిపారు.
అరెస్ట్ చేసిన తరువాత సీఐడీ పోలీసులు విచారణ చేపట్టారని న్యాయస్థానానికి వెల్లడించారు.కేబినెట్ ఆమోదం పొందిన తరువాతే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చిందన్న ఆయన కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబుపై కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు.