స్కంద మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. రామ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ కానీ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి థియేటర్లలో రామ్ పోతినేని( Ram Pothineni ) హీరోగా శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా తెరకెక్కిన స్కంద మూవీ( Skanda Movie ) విడుదలైంది.ఓవర్సీస్ లో ప్రీమియర్స్ రద్దు చేయడంతో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే టాక్ ఈ సినిమాకు కీలకం కానుంది.

 Ram Pothineni Sreeleela Skanda Movie Plus And Minus Points Details, Hero Ram Pot-TeluguStop.com

ఈరోజు ఉదయం నుంచి స్కంద షోలు ప్రదర్శితమవుతున్నాయి.బోయపాటి స్కంద సినిమాతో అఖండ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారనే చెప్పాలి.

స్కంద సినిమా మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉంది.యంగ్ జనరేషన్ ఆడియన్స్ కు నచ్చేలా ఈ సినిమాను తెరకెక్కించిన బోయపాటి శ్రీను( Boyapati Srinu ) ప్రశంసలను అందుకోవడంతో పాటు మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పవచ్చు.

రామ్ నటన, బోయపాటి శ్రీను డైరెక్షన్, థమన్ బీజీఎం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయని చెప్పవచ్చు.ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి రాజా( Daggubati Raja ) నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.కథ, కథనంలో చిన్నచిన్న లోటుపాట్లు ఉన్నా బోయపాటి శ్రీను సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చుతుందని చెప్పవచ్చు.ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ప్రేక్షకులను స్కంద మూవీ ఏ మాత్రం నిరాశ పరిచే ఛాన్స్ అయితే లేదు.

ఈ వీకెండ్ కు బెస్ట్ మాస్ మసాలా మూవీ చూడాలని భావించే వాళ్లు స్కంద మూవీపై లుక్కేయొచ్చు.స్కంద మూవీ కమర్షియల్ గా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.మరీ క్లాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుందో లేదో చెప్పలేము.

ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube