ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భారీగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పర్చగా ఆయనకు న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
అయితే ఇంత జరిగినా తమ పార్టీ అధినేత అరెస్ట్ అంశాన్ని ఉపయోగించుకుని సానుభూతి పొందాలని టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో రూ.వేల కోట్లను చంద్రబాబు దోచుకున్నారని సీఐడీ చెబుతున్నా మరోవైపు ఆ పార్టీ నేతలు మాత్రం బాబుది అక్రమ అరెస్ట్ అని, కావాలనే ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహారించిందని ఆరోపిస్తున్నారు.అయితే వాస్తవానికి చంద్రబాబు అరెస్టును ప్రజలు మాత్రం పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది.
పైగా చేసిన కర్మలకు ఏదో ఒక రోజు శిక్ష అనుభవించాలన్న చందాన ఆయన శిక్ష అనుభవిస్తున్నారని పలువురు చెప్పుకుంటున్నారని సమాచారం.
చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ నిన్నటి వరకు డబ్బులిచ్చి జనాలతో ఉత్తుత్తి ధర్నాలు, నిరసనలు చేయించిన టీడీపీ నేతలు ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశాలను వాడుకుంటున్నారు.
అసెంబ్లీలో గందరగోళం సృష్టిస్తూ ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇవాళ శాసనసభలో మీసం తిప్పి బాలయ్య బాబు నానా హంగామా చేశారన్న విషయం తెలిసిందే.
అయితే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య ఏనాడూ ప్రజా సమస్యల కోసం అసెంబ్లీలో గళమెత్తలేదు.కానీ తన బావ జైలులో ఉన్నాడన్న ఒక్క ఉద్దేశంతో ఈ సారి కావాలనే శాసనసభకు వచ్చారన్న విషయం కొట్టొచ్చినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వంపై ఏ విధంగా అయినా సరే బురద జల్లాలనే లక్ష్యంతో టీడీపీ సభ్యులు ప్లాన్ చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.ఈ ప్రకారమే బాలయ్య బాబు అసెంబ్లీలో తొడగొట్టి.
మీసం తిప్పి హంగామా చేశారు.ఆయనకు సామాజిక అంశాల మీద పట్టులేదు.
మాట్లాడే నేర్పు లేదు.ఈ నేపథ్యంలో ఆయనకు తెలిసింది ఒక్కటే సినిమా తరహాలో మీసం తిప్పడం.
తొడగొట్టడం.ఈ క్రమంలో అదే చేశారనే విమర్శలు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది.
ఇదంతా చాలదన్నట్లు చంద్రబాబు మీద పెట్టిన కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు.సభా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారిస్తూ పేపర్లు చించి గాల్లో విసేరాశారు.
స్పీకర్ ఎదుట మానిటర్ సైతం లాక్కునేందుకు ప్రయత్నించారు.తమ నాయకుడి అరెస్ట్ వ్యవహారాన్ని ఉపయోగించుకుని సానుభూతితో పాటు రాజకీయంగా లబ్ది పొందాలని టీడీపీ నేతలు భావిస్తున్నారన్న విషయం అర్థం అవుతోందని ఏపీ ప్రజలు అంటున్నారట.
అయితే ఆధారాలు లేనిది కోర్టు ఎందుకు రిమాండ్ విధిస్తుందన్న విషయాన్ని వారెందుకు గ్రహించడం లేదో తెలియడం లేదని పలువురు అంటున్నారు.