నేటి దైనందిత జీవితంలో స్మార్ట్ ఫోన్( Smart Phone ) వాడకుండా బతకడం దాదాపుగా అసాధ్యం.దాని అవసరం అటువంటిది మరి.
కమ్యూనికేషన్ నుండి ఇన్ఫర్మేషన్ వరకు నేడు అందరూ స్మార్ట్ ఫోన్ పైనే ఆధార పడుతున్న పరిస్థితి.ఇక వీటి వినియోగం ఎక్కువయ్యాక స్కాములు కూడా ఎక్కువైపోయాయి.
కొందరు హేకర్స్( Hackers ) డేటా చోరీ చేయడం మొదలు పెట్టారు.ఈ విషయంలో సదరు సెల్ ఫోన్ కంపెనీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వారిని నిలువరించలేకపోతున్న పరిస్థితి వుంది.
అయితే కొంతమంది సాధారణంగా తమ ఫోన్ కోసం యాంటీవైరస్ యాప్‌లను( Antivirus Apps ) వాడుతూ వుంటారు.
![Telugu Botnetmalware, Cyber, Escancert, Botnetremoval, Google Store, Indian, Mal Telugu Botnetmalware, Cyber, Escancert, Botnetremoval, Google Store, Indian, Mal](https://telugustop.com/wp-content/uploads/2023/09/indian-govt-offering-free-tool-to-remove-malware-from-your-phone-detailss.jpg)
అయితే ఇక్కడ ఏది మంచిది, ఏది చెడ్డది అనే విషయంపైన ఎరుకని కలిగి వుండడం చాలా అవసరం.అవును, ఇపుడు మీలాంటివారి కోసమే భారత ప్రభుత్వం స్వంత యాంటీవైరస్ యాప్ ఒకదానిని తీసుకువచ్చింది.ఇది ఎప్పటినుండో అందుబాటులో వున్నప్పటికీ చాలా మందికి తెలియకపోవడం చాలా బాధాకరం.
ఈ యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.బోట్‌నెట్ క్లీనింగ్ అండ్ మాల్వేర్ అనాలిసిస్ సెంటర్( Botnet Cleaning and Malware Analysis Center ) అని కూడా పిలువబడే భారత ప్రభుత్వ ‘సైబర్ శానిటేషన్ సెంటర్’( Cyber Sanitation Center ) ఫ్రీ బోట్‌నెట్ డిటెక్షన్ అండ్ రిమూవల్ టూల్‌ను అభివృద్ధి చేసింది.
![Telugu Botnetmalware, Cyber, Escancert, Botnetremoval, Google Store, Indian, Mal Telugu Botnetmalware, Cyber, Escancert, Botnetremoval, Google Store, Indian, Mal](https://telugustop.com/wp-content/uploads/2023/09/indian-govt-offering-free-tool-to-remove-malware-from-your-phone-detailsd.jpg)
ఈ యాప్ ఎలాంటి బాట్ యాప్, మాల్వేర్ ఇంకా వైరస్‌ని అయినా ఇట్టే పసిగట్టగలదు.‘Bot’ అనేది ఒక రకమైన మాల్వేర్, దీని సహాయంతో హ్యాకర్ మీ ఫోన్‌లోని మొత్తం డేటాను కాపీ చేసుకోవచ్చు.ఫోన్ నుండి ఇటువంటి మాల్వేర్ అండ్ వైరస్‌లను తొలగించడానికి ఇంకా గుర్తించడానికి, ప్రభుత్వం eScan CERT-In Bot Removal యాప్‌ను స్టార్ట్ చేయడం జరిగింది.మీరు ఇపుడు దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుండి eScan CERT-In Bot Removal యాప్‌ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏదైనా ఫెక్ ఇంకా స్పామ్ సైట్‌ను సందర్శించకుండా ఈ యాప్ మిమ్మల్ని నిరోధిస్తుంది.