సినిమాల్లో విలన్ రోల్స్ లో మెప్పించి ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్న దర్శకులు వీళ్లే!

ఈ మధ్య కాలంలో చాలామంది డైరెక్టర్లు భారీ బడ్జెట్ సినిమాలలో విలన్ రోల్స్ లో కనిపిస్తూ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.దర్శకులు విలన్లుగా నటిస్తుంటే ఆ సినిమాలకు ప్రేక్షకాదరణ సైతం దక్కుతుండటం గమనార్హం.

 Directors Turns Villains In Tollywood Srikanth Addala Karuna Kumar S. J. Surya-TeluguStop.com

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో పాపులారిటీని పెంచుకున్న శ్రీకాంత్ అడ్డాల పెదకాపు1 సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.

విరాట్ కర్ణ ( Virat Karna )పెదకాపు1 సినిమాతో హీరోగా పరిచయం కానున్నారు.

పలాస 1978 సినిమాతో దర్శకునిగా క్రేజ్ తెచ్చుకున్న కరుణ కుమార్ ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలో విలన్ గా నటించగా నా సామిరంగ మూవీలో సైతం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.ఈ డైరెక్టర్ ప్రస్తుతం వరుణ్ తేజ్ తో మట్కా సినిమాను తెరకెక్కిస్తుండగా ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Telugu Gautham Menon, Samudrakhani, Goutham Menon, Karuna Kumar, Sj Suryah, Srik

ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య ( S.J.Surya )స్పైడర్, మానాడు, మార్క్ ఆంటోని సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో నటించి మెప్పించారు.గేమ్ ఛేంజర్ సినిమాలో సైతం ఎస్.జె.సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు.ప్రముఖ డైరెక్టర్ సముద్రఖని( Director Samudrakhani ) అల వైకుంఠపురములో, సర్కారు వారి పాట, మాచర్ల నియోజకవర్గం, సార్ సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి మెప్పించారు.

Telugu Gautham Menon, Samudrakhani, Goutham Menon, Karuna Kumar, Sj Suryah, Srik

ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ( Directed by Gautham Menon )కొన్ని సినిమాలలో కీలక పాత్రల్లో నటించగా మైఖేల్ సినిమాలో విలన్ గా నటించారు.హిట్ లిస్ట్ అనే తమిళ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి గౌతమ్ మీనన్ ఆకట్టుకున్నారు.మరికొందరు దర్శకులు సైతం రాబోయే రోజుల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

డైరెక్టర్లు విలన్ రోల్స్ లో నటించడం వల్ల సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube