ఈ మాట అంటే ఇప్పుడు రాజమౌళి( Rajamouli ) అభిమానులకు చాల కోపం వస్తుందేమో కానీ రాజమౌళి కనుక ఒక్క ప్లాప్ సినిమా తీస్తే ఏం అవుతుంది అనే ప్రశ్న చాల మందిలో మొదలవుతుంది.అయన అసలు ప్లాప్ సినిమా తీసే అవకాశం లేదు అనుకోండి .
అది వేరే విషయం.కానీ ఏదైనా జరగరానిది జరిగి ఒకవేళ రాజమౌళి ప్లాప్ కనక కొడితే ఇండస్ట్రీ లో జరిగే పరిణామాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బయటకు చెప్పారు కానీ రాజమౌళి సినిమా ప్లాప్ కావాలని చాల మంది కోరుకుంటున్నారా.? అంటే అవును అనే సమాధానం వస్తుంది.ఈ మాట అంటుంది మరెవరో కాదు సంచలన సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
ఎందుకంటే రాజమౌళి సినిమా ప్లాప్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకోవడం లేదంట.ఇండస్ట్రీ లో సినిమాలు తీసే వారే అయన ప్లాప్ కోసం ఎదురు చూస్తున్నారట.ఆలా అయితే తప్ప టికెట్స్ రేట్స్ తగ్గుతాయి అంటున్నారు.
పైగా రాజమౌళి సినిమా వచ్చిందంటే ఒక రేంజ్ లో క్వాలిటీ వస్తుంది.ఆ క్వాలిటీ లో సినిమాను తీయాలంటే అందరికి బడ్జెట్ సరిపోదు.
బాహుబలి ( Bahubali )తీసాక బాహుబలిని మించి అందరు సినిమా చేయాలనీ ఎదురు చూస్తున్నారు.ఇప్పుడు ట్రిపుల్ ఆర్( RRR ) వచ్చాక అంతకన్నా మంచి సినిమా తీయాలి అంటున్నారు.
ఆలా తీయాలంటే అంత బడ్జెట్ పెట్టాల్సిందే.మరి అంత డబ్బు పెట్టక లౌ టికెట్ రేట్స్ ఎలా వర్క్ అవుట్ అవుతాయి.
కాదు కాబట్టి ప్రతి ఒక్కరు రాజమౌలి లా చేయలేరు కాబట్టి ఆ క్వాలిటీ ఇవ్వలేరు కాబట్టి ముందు రాజమౌళి ఆకాశం లో ఉండి సినిమాలు తీయడం మానేసి చిన్న బడ్జెట్ లో సింపుల్ గా సినిమాలు తీస్తే మంచిది అని రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) చెప్తున్నారు.
అందుకే అలాంటి అవకాశం కోసం ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్స్ ఎదురు చూస్తున్నారట.ఏది ఏమైనా ఆలా జరిగే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు.ట్రిపుల్ ఆర్ ని మించి మహేష్ బాబు కోసం రాజమౌళి బడ్జెట్ ని పెంచుతున్నాడు.
ఇక ఆదాయం కూడా అలాగే ఉండాల్సిందే.ఫ్యామిలీ మొత్తం కలిసి టికెట్ రేట్ ఎన్ని వందలు , వేలు ఉన్న కూడా చూస్తే తప్ప అన్ని వేళా కోట్ల రూపాయలు రావు మరి.ఈ విషయం లో వర్మ అభిప్రాయం తో చాల మంది ఏకీభవిస్తున్నారు.