టాలీవుడ్ నటుడు,నిర్మాత బండ్ల గణేష్ ( Produced by Bandla Ganesh )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొన్నటి వరకు నటుడిగా కొనసాగిన బండ్ల గణేష్ ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలను తెరకెక్కిస్తున్నారు.
ఒకవైపు సినిమాల కోసం సంబంధించిన పనులతో బిజీ బిజీగా ఉంటూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటూ ఎప్పటికప్పుడు రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ ట్వీట్ చేస్తూనే ఉంటారు.ఒకరకంగా చెప్పాలి అంటే బండ్ల గణేష్ సినిమాల ద్వారా కంటే రాజకీయాల ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్నారని చెప్పవచ్చు.
ఇక అప్పుడప్పుడు సామాజిక సేవలు చేస్తూ ప్రశంసలు అందుకుంటూ ఉంటారు.ఈ నేపథ్యంలోనే తాజాగా వినాయక చవితి పండుగ( Vinayaka Chavithi festival ) సందర్భంగా బండ్ల గణేష్ మరో గొప్ప పనిని చేసి తన మంచి మనసును చాటుకున్నారు.బండ్ల గణేష్ చేసిన పనికి అభిమానులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.వినాయక చవితి పండుగ సందర్భంగా కుటుంబ ఇంట్లో గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేసి అనంతరం కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి బయటకు వచ్చి అన్నదానం నిర్వహించారు.
బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్( Basavatharakam Cancer Hospital ) వద్ద రోగుల కుటుంబ సభ్యులకు అన్నదానం చేశారు.
భార్య కవిత, తమ్ముడు రామ్ చౌదరితో( Ram Chaudhary ) కలిసి స్వయంగా అందరికీ అన్నం వడ్డించారు బండ్ల గణేష్.ఇదే విషయాన్ని ఆయన తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీంతో బండ్ల గణేష్ చేసిన పనికి అభిమానులు నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ మేరకు బండ్ల గణేష్ అందుకు సంబంధించిన వీడియో షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు.
వినాయక చవితి సందర్భంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నేను నా భార్యతో పాటు తమ్ముడు రామ్ చౌదరితో కలిసి అన్న ప్రసాదం అందరికీ పంచటం నాకు ఆనందాన్ని ఇచ్చింది అని రాసుకొచ్చారు బండ్ల గణేష్.