మరొక రెండు రోజులలో బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమం మొదలవుతున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమం గురించి ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అయితే బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నటువంటి చివరి క్షణంలో ఈ కార్యక్రమం నుంచి బుల్లితెర నటి పూజ మూర్తి(Pooja Murthy)తప్పుకున్నారని తెలుస్తోంది.బిగ్ బాస్ సీజన్ సెవెన్ సెప్టెంబర్ మూడవ తేదీ ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికే లాంచింగ్ ఎపిసోడ్ కూడా షూటింగ్ పూర్తి అయిందని తెలుస్తోంది.అయితే ఈ కార్యక్రమం చివరి క్షణంలో బుల్లితెర నటి తప్పుకున్నట్లు సమాచారం.
బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో పూజ మూర్తి ఒకరు.పలు బుల్లితెర సీరియల్స్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 ) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.అయితే చివరి క్షణంలో తన తండ్రి మరణించడంతో ఈమె ఈ కార్యక్రమం నుంచి తప్పకున్నట్టు వార్తలు వస్తున్నాయి.తన తండ్రి చనిపోయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.
వీలైతే తిరిగి వచ్చేయండి.నేనేమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి.
మీరు ఎప్పుడూ మాతోనే ఉంటారని తెలుసు.అమ్మకు, నాకు మీ ఆశీస్సులు కావాలి, అని ఆమె ఇంస్టాగ్రామ్ స్టేటస్ పోస్ట్ చేశారు.
ఇలా పూజా మూర్తి తండ్రి( Pooja Murthy Father ) చనిపోవడంతో చివరి క్షణంలో ఈమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసారని తెలుస్తోంది.అయితే ఈమె స్థానంలో మరెవరినైనా తీసుకు వస్తారా లేక వైల్డ్ కార్డ్ ద్వారాఎంట్రీ ఇస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.ఇక నాగార్జున హోస్ట్ గా సీజన్ 7 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.ఊహాగానాలకు తెరదించుతూ ఆ రోజు ఒక్కో కంటెస్టెంట్ ని నాగార్జున (Nagarjuna)స్వయంగా పరిచయం చేస్తారు.
హౌస్లోకి పంపిస్తారు.ఇక ఈ సారి రెండు హౌస్ లు ఉంటాయని ప్రచారం జరుగుతుంది.
మరి ఈ సారైనా ఈ కార్యక్రమం సరికొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.