క్రికెట్ లో బ్యాటర్ కు బ్యాట్ అనుకూలంగా ఉంటేనే వరుస పరుగులతో పాటు వరుస బౌండరీలు బాదాగలుగుతాడు.విరాట్ కోహ్లీ లాంటి కొందరు ఆటగాళ్లు చాలా తేలికపాటి బ్యాట్లను ఉపయోగిస్తే.
అతి తక్కువ మంది బ్యాటర్లు అత్యంత బరువు ఉన్న బ్యాట్లను ఉపయోగిస్తూ ఉంటారు.అత్యంత బరువు ఉన్న బ్యాట్లను ఉపయోగించే టాప్-5 ఆటగాళ్లలో భారత్ కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఉండడం విశేషం అనే చెప్పాలి.వాళ్లు ఎవరో చూద్దాం.
సచిన్ టెండూల్కర్:
క్రికెట్ చరిత్రలో అత్యంత బరువైన బ్యాట్ తో ఆడిన ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్( Sachin Tendulkar ) అగ్రస్థానంలో ఉన్నాడు.సచిన్ MRF- Adidas కంపెనీకి చెందిన 1.47 కిలోల బ్యాట్ ను ఉపయోగించాడు.
క్రిస్ గేల్:
వెస్టిండీస్ మాజీ దిగ్గజం అత్యంత బరువైన బ్యాట్ తో ఆడిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.క్రిస్ గేల్( Chris Gayle ) Spartan CG కంపెనీకి చెందిన 1.36 కిలోల బ్యాట్ ను ఉపయోగించాడు.
వీరేంద్ర సెహ్వాగ్:
భారత జట్టు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు.వీరేంద్ర సెహ్వాగ్ 2008లో దక్షిణాఫ్రికాపై 1.35 కిలోల SG బ్యాట్ ను ఉపయోగించి 319 పరుగులు చేశాడు.
మహేంద్రసింగ్ ధోని:
భారత జట్టు కూల్ కెప్టెన్ గా ప్రత్యేక గుర్తింపు పొందిన మహేంద్రసింగ్ ధోని ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. మహేంద్ర సింగ్ ధోని 1.27 కిలోల Spartan బ్యాట్ ను ఉపయోగించాడు.
డేవిడ్ వార్నర్:
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నాడు.డేవిడ్ వార్నర్ 1.24 కిలోల బ్యాట్ ను ఉపయోగించాడు.