టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీ అయినా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు జక్కన్నపై( Rajamouli ) ఉన్న అభిమానం అంతాఇంతా కాదు.జక్కన్న ప్రతి క్షణం తన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ సినిమాలు సక్సెస్ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తారు.
జక్కన్న 2009లో కేవలం 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈగ అనే సినిమా( Eega movie )ను విజువల్ వండర్ గా తెరకెక్కించి సక్సెస్ సాధించారు.

ప్రస్తుతం 500, 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కిస్తున్నా ఆ సినిమాలు మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మెప్పించలేకపోతున్నాయి.మరోవైపు స్టార్ హీరో డేట్లు ఇస్తే ఏ మాత్రం టాలెంట్ లేని డైరెక్టర్లు సైతం 500, 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు.అయితే జక్కన్నను చూసి చాలమంది డైరెక్టర్లు వాతలు పెట్టుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రాజమౌళిలా సక్సెస్ కావాలంటే రాజమౌళి స్థాయిలో బడ్జెట్ పెడితే సరిపోదని జక్కన్న స్థాయిలో కష్టపడాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.జక్కన్న ప్రస్తుతం మహేష్ బాబు సినిమా( Mahesh babu movie ) ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.దాదాపుగా రెండేళ్ల పాటు రాజమౌళి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం కష్టపడుతున్నారు.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.2024 సంవత్సరం జనవరిలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ త్వరలో సెట్స్ పైకి వెళుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రాజమౌళి ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
జక్కన్న క్రేజ్, రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో సినిమాలు తీసి ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల ఇండస్ట్రీ అతలాకుతలం అవుతోంది.
రాజమౌళిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా జక్కన్న ఎంత ఎదిగినా ఒదిగి ఉంటున్నారు.