వైరల్ వీడియో: ఓవైపు వర్షం.. మరోవైపు చెంగుచెంగున జింక పిల్లల ఆనందం..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.ఇటీవల ఉత్తరాదిని వర్షాలు వణికించాయి.

 Viral Video Rain On One Side On The Other Hand, The Happiness Of The Deer Cubs ,-TeluguStop.com

వర్షాలకు ఢిల్లీ, ముంబైలలో ( Delhi , Mumbai )జనజీవనం స్తంభించిపోయి ఎంతో ఆస్తి నష్టం చోటుచేసుకుంది.అయితే ప్రస్తుతం దక్షిణాదిని కూడా వర్షాలు భయపెడుతున్నాయి.

గత వారం రోజులుగా కురిసిన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.రోడ్డపైకి నీళ్లు చేరుకోవడం, కాలనీలు మునిగిపోవడం, ఇళ్లల్లోకి నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వరద ప్రవాహంలో కొంతమంది కొట్టుకుపోయి గల్లంతైన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.

అయితే వర్షాలు పడే సమయంలో జింకలు( Deer ) బయటకు వచ్చి కనువిందు చేస్తూ ఉంటాయి.వీటిని చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) ఒక వీడియోను షేర్ చేశారు.

ఈ వీడియోలో జింకలు కనువిందు చేశాయి.ఒకవైపు జోరు వర్షం పడుతూ హోరున గాలి వీస్తోంది.

అలాగే ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడుతున్నాయి.దీంతో ఈ శబ్ధాలకు అడవిలో ఉన్న జింకలు బయటకు వచ్చి ఒక భవనంపై తలదాచుకున్నాయి.

జపాన్ లోని నారా అటవీ ప్రాంతంలో( Nara Forest region of Japan ) అరుదైన దృశ్యం కనిపించింది.వర్షం పడుతున్న సమయంలో బయటకొచ్చిన జింకులు భవనంపై తలదాచుకోవడాన్ని అందరూ ఆసక్తిగా తిలకించారు.మనుషులు ఉన్నా సరే భవనం కిందకు వచ్చి తలదాచున్నాయి.ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేయడంతో వైరల్ గామారింది.వాన తాకిడిని తట్టుకోలేక మనుషులు జీవించే ప్రాంతాల్లోకి వచ్చాయని చెప్పారు.ఈ వీడియో తనకు ఎంతో నేర్పిందని, జాగ్రత్తగా ఈ వీడియోను దాచిపెట్టుకుంటానని వ్యాఖ్యానించారు.

ప్రపంచం ఎలా ఉండాలనేది నేను అనుకుంటున్నప్పుడు ఇది తనకు సరైన మార్గదర్శిగా అనిపించిందని అన్నారు.ఈ వీడియో తనకు చాలా నేర్పిందని ఆనంద్ మహీంద్రా తెలిపారు.

ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తుండగా.నెటిజన్లు వివిధ కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube