గ్రీన్ టీను ఈ విధంగా తీసుకుంటే వెయిట్ లాస్ తో పాటు మరెన్నో అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం!

గ్రీన్ టీ.( Green Tea ) ఇటీవల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సేవించే పానీయాల్లో ఇది ఒకటి.

 Consuming Green Tea In This Way Has Many Other Amazing Health Benefits!,green Te-TeluguStop.com

ముఖ్యంగా హెల్త్, ఫిట్ నెస్ పై శ్రద్ధ ఉన్నవారు తప్పకుండా తమ డైట్ లో ఒక కప్పు గ్రీన్ టీ ఉండేలా చూసుకుంటారు.బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు తమ రోజును గ్రీన్ టీ తోనే ప్రారంభిస్తుంటారు.

అయితే గ్రీన్ టీ నేరుగా కాకుండా ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే వెయిట్ లాస్( Weight Loss ) తో పాటు మరెన్నో అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం గ్రీన్ టీను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Green Tea, Tips, Healthy Skin, Immunity, Latest-Telugu Health

ముందుగా ఒక గ్లాసు తీసుకుని అందులో పావు టేబుల్ స్పూన్ అల్లం పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి( Cinnamon Powder ), రెండు ఫ్రెష్ లెమన్ స్లైసెస్ వేసుకోవాలి.ఆ తర్వాత ఒక గ్రీన్ టీ బ్యాగ్ మరియు రెండు టేబుల్ స్పూన్లు తేనె వేసుకోవాలి.చివరిగా మరిగించిన వాటర్ తో గ్లాస్ ను ఫిల్ చేసుకుని ఫోన్ సహాయంతో బాగా మిక్స్ చేసి మూత పెట్టాలి.ఇది నిమిషాల తర్వాత ఆ గ్రీన్ టీ ని సేవించాలి.

ఈ విధంగా గ్రీన్ టీ ని కనుక తీసుకుంటే మరింత వేగంగా బరువు తగ్గుతారు.

శరీరంలో క్యాలరీలు సూపర్ ఫాస్ట్ గా కరుగుతాయి.

అలాగే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు మాయం అవుతుంది.కొద్ది రోజుల్లోనే బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.

గ్రీన్ టీ ను ఇప్పుడు చెప్పిన విధంగా రోజు తీసుకోవ‌డం వ‌ల్ల నిరోధక వ్యవస్థ( Immunity System ) బలపడుతుంది.జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు వంటి సమస్యలు ఉంటే దూరం అవుతాయి.

అలాగే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.డిప్రెషన్, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు పరార్ అవుతాయి.

Telugu Green Tea, Tips, Healthy Skin, Immunity, Latest-Telugu Health

ఇటీవల రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే మధుమేహం( Diabetes ) బారిన పడుతున్నారు.అయితే గ్రీన్ టీ ను రెగ్యులర్ గా కాకుండా పైన చెప్పిన విధంగా తీసుకుంటే మధుమేహం వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది.మోకాళ్ళ నొప్పులు దూరం అవుతాయి.శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి.గుండెపోటు క్యాన్సర్( Cancer ) వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.అంతేకాదు ఇప్పుడు చెప్పుకున్న విధంగా గ్రీన్ టీ తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా యవ్వనంగా మెరుస్తుంది.

మొటిమలు తరచూ ఇబ్బంది పెట్టకుండా సైతం ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube