యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Young Rebel Star Prabhas ) హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో ”సలార్” ఒకటి.ఆదిపురుష్ వంటి ప్లాప్ తర్వాత ప్రభాస్ నుండి రాబోతున్న సినిమా ఇదే కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.
ఇదైనా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నారు.మరి ఈ సినిమా మరో రెండు నెలల్లో రిలీజ్ కాబోతుంది.

దీంతో మేకర్స్ వేరే రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు.సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ నుండి టీజర్ రిలీజ్ చేసి అంచనాలు అమాంతం పెంచేయగా ట్రైలర్ ఆగస్టులో రాబోతుంది అని అనౌన్స్ చేసారు.దీంతో ఇప్పుడు అంతా కూడా ట్రైలర్( Salaar Trailer ) కోసం ఎదురు చూస్తున్నారు.ఇక రిలీజ్ సమయంలో కూడా భారీ ప్లానింగ్ తో సిద్ధం అవుతున్నారు.ఇప్పటికే సలార్( Salaar ) ను ఓవర్సీస్ లో 1980 కి పైగానే లొకేషన్స్ లో రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపగా సలార్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.ఇక ఇప్పుడు ఓవర్సీస్ లో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలో కూడా హైయెస్ట్ రిలీజ్ అయ్యేలా ప్లానింగ్ చేస్తున్నట్టు టాక్.
ఇదే నిజమైతే ఈసారి ఓపెనింగ్స్ మరింత పెరిగి అక్కడి నుండి సలార్ రికార్డులను తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటున్నారు.

మరి తప్పకుండ సలార్ అందరి అంచనాలను అందుకుని బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకుంటుందని అంతా భావిస్తున్నారు.కాగా ఈ సినిమాలో శృతి హాసన్( Shruuti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.
సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.చూడాలి ఈ సినిమా అయిన ప్రభాస్ కెరీర్ లో బాహుబలి రేంజ్ హిట్ అందుకుంటుందో లేదో.







