క్రీడా ప్రపంచంలో అత్యధిక ప్రైజ్ మనీ( Highest Prize Money ) ప్రతిష్టాత్మకమైన టెన్నిస్ టోర్నీ వింబుల్డన్( Wimbledon ) విజేతకు ఉంటుంది.వింబుల్డన్ 2023 ప్రైజ్ మనీ ఏకంగా 11 శాతం పెంచారు.
అయితే ఏ టోర్నీలో ఎంత ప్రైజ్ మనీ ఇస్తారు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.వింబుల్డన్ 2023లో టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో 20 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్,( Carlos Alcaraz ) నోవాక్ జకోవిచ్ ను ఓడించి టైటిల్ గెల్చుకున్నాడు.విన్నర్ అయిన కార్లోస్ ఆల్కరాజ్ దాదాపుగా రూ.25 కోట్ల ప్రైజ్ మనీ అందుకున్నాడు.రన్నరప్ గా నిలిచిన నోవాక్ జకోవిచ్ కు రూ.12.25 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.
వింబుల్డన్ తర్వాత అత్యధిక భారీ ప్రైజ్ మనీ ఇచ్చే టోర్నీ గా భారత్ లో నిర్వహించే ఐపీఎల్( IPL ) నిలిచింది.
ఐపీఎల్ 2023 టైటిల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్( CSK ) అని తెలిసిందే.టైటిల్ గెలిచిన జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.ఈ ప్రైజ్ మనీ మొత్తం జట్టుకు పంపిణీ చేయబడింది.ఇక ఐపీఎల్ 2023 రన్నరప్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ కు రూ.13 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.

టెన్నిస్ టోర్నమెంట్ కేవలం వింబుల్డన్ లోనే కాకుండా ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ లలో కూడా నిర్వహించబడతాయి.గత ఏడాది యూఎస్ ఓపెన్ లో సింగిల్ ఈవెంట్లో విజేతగా నిలిచిన ఆటగాడికి రూ.20 కోట్ల ప్రైజ్ మనీ అందించారు.ఆస్ట్రేలియా ఓపెన్ 2023 లో సింగిల్ ఈవెంట్ విజేతకు రూ.16.73 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.

ఫ్రెంచ్ ఓపెన్ 2023 సింగిల్ ఈవెంట్లో విజేతకు రూ.20.58 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.ఈ టోర్నీల తర్వాత అత్యధిక భారీ ప్రైజ్ మనీ ఇచ్చే టోర్నీ గా టీ20 వరల్డ్ కప్( T20 World Cup ) నిలిచింది.టీ20 వరల్డ్ కప్ 2022 విజేతగా నిలిచిన ఇంగ్లాండుకు రూ.13.05 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.రన్నరప్ గా నిలిచినా పాకిస్తాన్ కు రూ.6.5 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.