జులైలో ప్రభాస్ ఫ్యాన్స్ కు డబల్ ట్రీట్.. డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) చేతిలో ప్రస్తుతం భారీ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.అందులో ఆదిపురుష్ సినిమా( Adipurush ) ఇటీవలే జూన్ 16న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

 Prabhas Project K And Salaar Movie Latest Update, Prabhas, Project K, Deepika Pa-TeluguStop.com

భారీ మైథలాజికల్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ కాగా ప్లాప్ అయ్యింది.రామాయణంను మార్చి తీయకపోయి ఉంటే ఈ సినిమా వెయ్యి కోట్లు రాబట్టి ఉండేది.

కానీ ఆ అవకాశాన్ని ఆదిపురుష్ మిస్ చేసుకుంది.రామాయణం ను పూర్తి మార్చేసి మరో కోణంలో తీయడంతో డైరెక్టర్ ఓం రౌత్ మీద, రైటర్ మీద ఆగ్రహంగా ఉన్నారు.ఇక ఈ సినిమా కేసుల ప్రభాస్ అభిమానులను నిరాశ పరచడంతో తర్వాత ప్రాజెక్టులపై ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.మరి ఈయన లైనప్ లో నెక్స్ట్ రాబోతున్న మూవీలు సలార్, ప్రాజెక్ట్ కే.(

ఈ సినిమాల అప్డేట్ ల కోసం ఎదురు చూస్తున్నారు.అయితే ఈ క్రమంలోనే డార్లింగ్ ఫ్యాన్స్ కు ఈ నెలలోనే డబల్ ట్రీట్ ఉంటుంది అని అందుకు గెట్ రెడీ అంటున్నారు.

సలార్ టీజర్( Salaar Teaser ) రిలీజ్ అవ్వాల్సి ఉంది.దాంతో పాటు ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్ కే టైటిల్ కూడా ఇదే నెలలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందట.

ఈ టైటిల్ రిలీజ్ ను యూఎస్ లో చేయనున్నట్టు టాక్.

ఇలా జులై లోనే రెండు అప్డేట్ లతో డబల్ ట్రీట్ ఖాయం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరి ఇదే నిజమైతే బాగుండు అని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.సలార్ సినిమాను ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) తెరకెక్కిస్తుండగా.

ప్రాజెక్ట్ కే సినిమా( Project K )ను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్ కు సిద్ధం అవుతుంటే.

ప్రాజెక్ట్ కే 2024 జనవరి 12న రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube