సినిమా జనాలకి ఎక్కువగా రీచ్ అవ్వాలి అంటే టైటిల్ అనేది చాలా ముఖ్యం.ఒక సినిమా పేరు ఎంత క్యాచీగా ఉంటే ప్రేక్షకుల దృష్టిలో అంత ఈజీగా పడుతుంది.
అందుకే సినిమా టైటిల్స్ చాలా డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటారు.అలాగే టైటిల్ సినిమా కథకు తగ్గట్టు ఉండడం కూడా ఎంతో ముఖ్యం…
అయితే కొన్ని సార్లు కథకు తగ్గ టైటిల్ ని పాత హిట్ సినిమాల నుంచి తీసుకున్నారు మేకర్స్… చాలా మంది హీరోలు పాత సినిమాల టైటిల్స్‌ను తమ సినిమాలకు పెడుతూ.
ఆయా సినిమాలపై క్రేజ్ తీసుకొచ్చే పనిలో పడ్డారు.అందులో కొంత మంది పాత సినిమాల క్లాసిక్ టైటిల్స్‌ను చెడగొట్టారు.
కొందరు హిట్టు కూడా అందుకున్నారు.ఇప్పుడు ఆ సినిమాలేవో చూద్దాం…
ఖుషి
హీరోగా పవన్ కళ్యాణ్ రేంజ్‌ను పెంచిన మూవీస్‌లో ‘ఖుషీ’ ( Khusi Movie ) ఒకటి.
ఈ సినిమా టైటిల్‌తో ఇపుడు విజయ్ దేవరకొండ, సమంత చిత్రం రాబోతోంది.ఖుషీ టైటిల్‌తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచారు…
తొలిప్రేమ
పవన్ కళ్యాణ్‌కు హీరోగా బ్రేక్ ఇచ్చిన చిత్రం ‘తొలి ప్రేమ’.( Tholi Prema ) కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అప్పటి యూత్‌కు బాగా కనెక్ట్ అయింది.ఈ మూవీ టైటిల్‌తో పవన్ కళ్యాణ్ అన్న కుమారుడు వరుణ్ తేజ్.
సినిమా చేసి హిట్ అందుకున్నాడు…ఇక నిన్న నే తొలిప్రేమ సినిమా రీ రిలీజ్ కూడా చేశారు.రీ రిలీజ్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ని ఈ సినిమా అందుకుంటుంది…
సుల్తాన్
నందమూరి నట సింహా బాలకృష్ణ నటించిన సుల్తాన్ మూవీ( Sultan Movie ) టైటిల్‌తో కార్తి హీరోగా వచ్చిన ఈ మూవీ అంతగా అలరించ లేకపోయింది…
బంగారు బుల్లోడు
బాలకృష్ణ పాత సూపర్ హిట్ ‘బంగారు బుల్లోడు’ టైటిల్‌తో అల్లరి నరేష్ సినిమా చేసాదు.ఈ సినిమాతో అల్లరి నరేష్ బాక్సాఫీస్ దగ్గర మరో డిజాస్టర్‌ను అందుకున్నాడు…
శ్రీమంతుడు
అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు ’శ్రీమంతుడు’ సినిమాతో సక్సెస్ అందుకుంటే.ఆ తర్వాత చాలా యేళ్లకు మహేష్ బాబు అదే టైటిల్‌తో సూపర్ హిట్ అందుకున్నాడు…
స్వాతిముత్యం
కళా తపస్వీ కే విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ఆల్ టైమ్ హిట్ మూవీ ‘స్వాతి ముత్యం’ . ఈ సినిమాలో అమాయకుడి పాత్రలో కమల్ నటనను ఎవరు మరిచిపోలేరు.గతేడాది అదే ’స్వాతి ముత్యం’ టైటిల్‌తో బెల్లంకొండ సురేష్ బాబు రెండో తనయుడు బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా సినిమా చేసాడు…
వారసుడు
ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున హీరోలుగా నటించిన ’ వారసుడు’ మూవీ హిట్ అయ్యింది.ఇక తాజాగా కోలీవుడ్ హీరో విజయ్ కూడా ‘వారసుడు’ గా ప్రేక్షకుల ముందుకి వచ్చారు…
విక్రమ్
కమల్ హాసన్ హీరోగా నటించిన మూవీ ‘విక్రమ్’ మూవీ కూడా నాగార్జున హీరోగా నటించిన విక్రమ్ మూవీ టైటిల్ నే తీసుకున్నారు…
గాడ్ ఫాదర్
ఏఎన్నార్, వినోద్ కుమార్ హీరోలుగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో గతంలో ‘గాడ్ ఫాదర్’ సినిమా వచ్చింది.చాలా సంవత్సరాలకు అదే టైటిల్‌తో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీతో పలకరించారు…
మహర్షి
వంశీ దర్శకత్వంలో 90 దశకంలో వచ్చిన మూవీ ‘మహర్షి’. మ్యూజికల్‌గా పెద్ద హిట్టైయిన ఈ సినిమా టైటిల్‌తో చాలా యేళ్ల తర్వాత మహేష్ బాబు సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు…
సర్దార్
80లలో రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా సర్థార్ సినిమా తెరకెక్కింది.కార్తి మరోసారి అదే ‘సర్ధార్’ టైటిల్‌తో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు…
బ్రో
అవికా గోర్ , నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం బ్రో. తాజాగా ఇదే టైటిల్ తో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మూవీ రాబోతుంది…
ఇంకా ఇలాంటి పేర్లతో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి…
.