నిఖిల్ హీరోగా తెరకెక్కిన స్పై మూవీ( Spy Movie ) భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలై ఆ అంచనాలను అందుకోలేక ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రానా గెస్ట్ రోల్ లో నటించి మెప్పించారు.
రానా నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.ఆయన పాత్రకు సంబంధించి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ రోల్ కు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వాస్తవానికి ఈ రోల్ కోసం స్పై మూవీ మేకర్స్ మొదట నాగచైతన్య( Naga Chaitanya )ను సంప్రదించారట.అయితే షూట్ సమయంలో నాగచైతన్య విదేశాల్లో ఉండటంతో నిఖిల్( Naga Chaitanya ) కు సన్నిహితుడైన రానా ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.ఈ సినిమాలో కొన్ని నిమిషాల పాటు కనిపించే పాత్ర కోసం రానా ఏకంగా 40 లక్షల రూపాయలు తీసుకున్నారని సమాచారం అందుతోంది.
ఈ మొత్తం ఒకింత ఎక్కువ మొత్తమే అయినా రానా( Rana Daggubati ) ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించడం ఈ సినిమాకు బిజినెస్ విషయంలో హెల్ప్ అయింది.మరోవైపు రానా సోలో హీరోగా కెరీర్ పరంగా బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సోలో హీరోగా రానా నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.రానా సోలో హీరోగా నటించే ప్రాజెక్ట్ ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
స్పై సినిమాలో ఐశ్వర్య మీనన్( Iswarya Menon ) హీరోయిన్ గా నటించగా ఓజీ సినిమాలో ఈ బ్యూటీకి ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది.పవన్ కు జోడీగా కొన్ని నిమిషాల పాటు ఐశ్వర్య మీనన్ కనిపించనున్నారని సమాచారం.
ఐశ్వర్య మీనన్ రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లోనే ఉందని తెలుస్తోంది.