అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ఎదుట మృతుల బంధువులు ధర్నాకు దిగారు.నిన్న పరిశ్రమలో సంభవించిన అగ్నిప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.
కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
బంధువుల ధర్నాకు జనసేన, బీజేపీతో పాటు సీఐటీయూ నేతలు మద్ధతు తెలిపారు.
మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించడంతో పాటు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు.
కాగా నిన్న పరిశ్రమలో రెండు రియాక్టర్లు పేలడంతో మంటలు చెలరేగి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో కంపెనీలోని ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరికొందరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.







