కొందరు డైరెక్టర్స్ నన్ను వాడుకున్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన పాయల్ రాజ్‌పుత్?

తెలుగు సినీ ప్రేక్షకులకు ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్( Payal Rajput ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ యంగ్ కార్తికేయ హీరోగా నటించిన ఆర్ఎక్స్ 100 సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.

 Payal Rajput Emotional Comments About Misguidance Of Directors, Payal Rajput, Em-TeluguStop.com

అలాగే ఓవర్ నైట్ లో స్టార్ డమ్ ని అందుకుంది.ఈ సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

మరి ముఖ్యంగా రొమాంటిక్ సీన్లు( Romantic Scenes ) రెచ్చిపోయిందని చెప్పవచ్చు.అయితే ఆ తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు తగిన విధంగా గుర్తింపు దక్కలేదు.

దీంతో ఈ మధ్యకాలంలో సరైన సినిమా లేక సరైన హిట్టు లేక ఈ ముద్దుగుమ్మ కొట్టుమిట్టాడుతోంది.

Telugu Directors, Payal Rajput, Rx, Tollywood-Movie

అయితే వరుసగా అవకాశాలను అందుకుంటున్నప్పటికీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ అవడం లేదు.దీంతో సినిమాలపై కాస్త ఆ గట్టిగానే ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి.కాగా ఆర్‌ఎక్స్100( RX 100 ) రేంజ్ సక్సెస్ కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తోంది పాయల్.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసింది.కొందరు టాలీవుడ్ డైరెక్టర్లపై( Tollywood Directors ) షాకింగ్ కామెంట్స్ చేసింది.

పాయల్ రాజ్ పుత్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఐదు ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ సరైన అవకాశాలు లేక ఇబ్బందులు పడుతోంది.ఈ విషయం గురించి పాయల్ రాజ్ పుత్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.

Telugu Directors, Payal Rajput, Rx, Tollywood-Movie

నా వరకు నేను ప్రతి సినిమాకు 200 శాతం ఎఫర్ట్స్ పెడతాను.కానీ అవి ఫేవర్‌ గా వర్కవుట్ కాకపోవడం నా చేతుల్లో లేదు.అదంతా డెస్టినీ.నిజం చెప్పాలంటే ఆర్‌ఎక్స్100 తర్వాత మిస్‌గైడెన్స్ వల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది.చాలా మంది నన్ను అడ్వాంటేజ్‌గా తీసుకున్న విషయాన్ని నేను కూడా గుర్తించాను.కొంతమంది డైరెక్టర్లు నన్ను వాడుకున్నారు.

ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది.ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడికి వెళ్లకూడదనే విషయంలో కొంచెం బుర్ర వాడుతున్నాను.

ప్యూచర్ ప్రాజెక్టుల కోసం సిక్స్త్ సెన్స్ యూజ్ చేస్తున్నాను అని వెల్లడించింది పాయల్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube