క్రెడిట్ కార్డ్ వాడేవారికి ఇకపై భారీ ఆంక్షలు.. కొత్త నిబంధనలు జారీచేసిన ఆర్బీఐ..!

కరోనా మహమ్మారి వచ్చినప్పటినుండి భారతదేశంలో( India ) జరిగే లావాదేవీలన్నీ ఆన్లైన్ రూపంలో జరగడం ప్రారంభమయ్యాయి.కస్టమర్లు ఆన్లైన్లో చెల్లింపులు, బ్యాలెన్స్ మెయింటెన్, ట్రాన్సాక్షన్లపై బ్యాంకులు కస్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

 Heavy Restrictions For Credit Card Users Rbi Has Issued New Regulations , Rbi, C-TeluguStop.com
Telugu Axis Banks, Credit, Hdfc Bank, Icici, India, Latest Telugu-Technology Tel

ఈ నేపథ్యంలో తమ కస్టమర్లకు ఎలాంటి ప్రాసెస్ ఫీజులు లేకుండానే క్రెడిట్ కార్డులను బ్యాంకులు జారీ చేస్తున్నాయి.అయితే క్రెడిట్ కార్డు ద్వారా వస్తువులు కొనుగోలు చేస్తే తక్కువ వడ్డీ పడుతూ ఉండడంతో చాలామంది క్రెడిట్ కార్డు( Credit card ) ద్వారానే షాపింగ్ చేయడం మొదలుపెట్టారు.ఈ నేపథ్యంలోనే భారీగా పరిమితికి మంచి పర్సనల్స్ లోన్స్ కూడా తీసుకుంటున్నారు.ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత దేశంలో ఉండే బ్యాంకుల పనితీరుపై నిగా పెట్టింది.

ఏ బ్యాంకు ఎన్ని క్రెడిట్ కార్డులు జారీ చేసిందో.ఎంత మొత్తంలో పర్సనల్ లోన్స్ విడుదల చేసిందో అనే సమాచారాన్ని పరిగణలోకి తీసుకుంది.

ఈ జాబితాలో హెచ్డిఎఫ్సి బ్యాంక్( HDFC Bank ) అగ్రస్థానంలో ఉండగా ఎస్బిఐ, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంకులు( SBI, ICICI, Axis Banks ) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఈ బ్యాంకులు కోట్లాదిమంది తమ కస్టమర్లకు క్రెడిట్ కార్డులు జారీ చేశాయి.

Telugu Axis Banks, Credit, Hdfc Bank, Icici, India, Latest Telugu-Technology Tel

క్రెడిట్ కార్డ్ ను బ్యాంకులు జారీ చేయడానికి ప్రత్యేక కారణం వాటితో వస్తువులను కొనుగోలు చేయడం కోసం, అత్యవసర సమయాలలో తక్కువ వడ్డీతో రుణం పొందడం కోసం ఇస్తారు.కానీ కొందరు క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఇష్టానుసారం లోన్లు తీసుకుంటున్నారు.2023 ఫిబ్రవరి లెక్కలను గమనిస్తే ఏకంగా పర్సనల్ లోన్స్ రూపంలో రూ.33 లక్షల కోట్ల నుంచి రూ.40 లక్షల కోట్ల వరకు పెరిగినట్లు తెలుస్తుంది.ఈ లోన్లు అన్ని అన్ సెక్యూర్డ్ లోన్స్ కావడంతో వడ్డీ రేట్లు అధికంగానే ఉంటాయి.

కాకపోతే ఆర్థికపరమైన చిక్కులు వచ్చే ప్రమాదం ఉందని ఆర్బీఐ తెలిపింది.కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న ఆర్బీఐ సులభంగా లోన్లు ఇచ్చే అవకాశం లేకుండా కఠిన ఆంక్షలు జారీ చేయాలని బ్యాంకులకు సూచనలు ఇచ్చింది.

ఇకపై క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ తీసుకునే వారికి ఆంక్షలు కఠినంగా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube