ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం బాపట్ల జిల్లా ఉప్పాలవారిపాలెంలో అమర్నాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.సోదరిని వేధిస్తున్న ఆకతాయిలను ఎదిరించటంతో.
వారి చేతుల్లో అమర్నాథ్ దారుణ హత్యకు గురి కావడం జరిగింది.ఈ హత్య ఘటన రాష్ట్రంలో అందరిని కలిచి వేసింది.
కాగా అధికార పార్టీ అండతోనే రాష్ట్రంలో దారుణ ఘటనలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు.ఈ క్రమంలో లక్ష రూపాయల చెక్కును అమర్నాథ్ కుటుంబానికి సోము వీర్రాజు అందజేయడం జరిగింది.
ఇటువంటి దారుణ ఘటనలు పునరావ్రతం కాకూడదని తెలియజేశారు.ఇదే సమయంలో రాష్ట్ర డీజీపీ ఈ కేసును స్పెషల్ కేసుగా పరిగణించి నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ముకాసేలా ఉండటం సరికాదన్నారు.ఏది ఏమైనా పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాయకుండా ఈ కేసును దర్యాప్తు చేయాలని సోము వీర్రాజు సూచించారు.ఇదిలా ఉంటే నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అమర్నాథ్ కుటుంబ సభ్యులను ఓదార్చి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది.
అదే సమయంలో బాలుడు అమర్నాథ్ కుటుంబ సభ్యులను ఓదార్చి అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.కాగా నేడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరి కొంతమంది నేతలు అమర్నాథ్ కుటుంబ సభ్యులను పలకరించడం జరిగింది.