అల్లు శిరీష్ తో రాజమౌళి సినిమా కోసం అల్లు అరవింద్ ఇన్ని ప్రయత్నాలు చేశాడా..!

తెలుగు సినిమా ఇండస్ట్రీ ని శాసించగల సత్తా ఉన్న ఇద్దరు ముగ్గురు నిర్మాతలలో ఒకరు అల్లు అరవింద్.( Allu Aravind ) స్వర్గీయ అల్లు రామ లింగయ్య కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టొ , తండ్రిలాగా నటుడిగా కాకుండా , నిర్మాతగా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత చిరంజీవి ఇంటి అల్లుడు అయ్యాక, అతనితో ఎంతో మంచి స్నేహ బంధం ఏర్పర్చుకొని అతనితో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి ఇండస్ట్రీ లో స్టార్ నిర్మాతగా ఎదిగాడు.

 Has Allu Aravind Made So Many Efforts For Rajamouli Movie With Allu Sirish Detai-TeluguStop.com

ఇక ఆయన తనయుడు అల్లు అర్జున్( Allu Arjun ) హీరో గా ఎంట్రీ ఇచ్చి, ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు పాన్ వరల్డ్ రేంజ్ స్టార్ గా గుర్తింపుని తెచ్చుకున్నాడు.ఇప్పుడు ఆయన సినిమా కోసం కేవలం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు, ప్రపంచం నలుమూలల ఉన్న సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అల్లు అర్జున్ ఈ రేంజ్ కి రావడం పై అల్లు అరవింద్ కి ఎంతో పుత్రోత్సాహం ఉంటుంది.

Telugu Allu Aravind, Alluaravind, Allu Arjun, Allu Sirish, Rajamouli, Magadheera

అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా అల్లు అరవింద్ లో మనం ఆ సంతోషాన్ని గమనించొచ్చు.అయితే పెద్ద కొడుకు ఈ రేంజ్ లో సక్సెస్ అయ్యినప్పటికీ, చిన్న కొడుకు అల్లు శిరీష్ ని( Allu Sirish ) హీరో గా ఇండస్ట్రీ లో స్థిరపర్చలేకపోయానే అని అల్లు అరవింద్ లో మొదటి నుండి చాలా బాధ ఉంది.ఆయన కెరీర్ ని చక్కదిద్దడానికి అల్లు అరవింద్ చెయ్యని ప్రయత్నం అంటూ ఏది లేదు.

పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో అతనిని లాంచ్ చేయించడానికి ప్రయత్నం చేసాడు.అందులో దర్శకధీరుడు రాజమౌళి( Director Rajamouli ) కూడా ఉన్నాడు.అల్లు అరవింద్ రాజమౌళి తో ‘మగధీర’ లాంటి అద్భుతాన్ని ఆవిష్కరించాడు.ఆ చొరవతోనే మగధీర సమయం లో తన చిన్న కొడుకు అల్లు శిరీష్ తో ఒక సినిమా తియ్యల్సిందిగా కోరాడు.

అదేంటి అల్లు అర్జున్ లాంటి స్టార్ కోసం అడగకుండా, అల్లు శిరీష్ కోసం అడుగుతున్నాడు అని మీరు అనుకోవచ్చు.

Telugu Allu Aravind, Alluaravind, Allu Arjun, Allu Sirish, Rajamouli, Magadheera

కానీ అల్లు అరవింద్ లెక్కే వేరు, అల్లు అర్జున్ అప్పటికే ఇండస్ట్రీ లో బాగా స్థిరపడిపోయిన హీరో, ఆయనకీ అప్పుడే రాజమౌళి తో సినిమా చెయ్యాల్సిన అవసరం లేదు.కానీ అల్లు శిరీష్ స్థిరపడాలి అంటే కచ్చితంగా రాజమౌళి లాంటి డైరెక్టర్ కావాలి, అందుకే అడిగాడు.మగధీర చిత్రం తర్వాత ఎలాగో చిన్న సినిమా తియ్యాలి అనుకుంటున్నావు కదా, అదేదో మా శిరీష్ తో చెయ్యి అని అడిగాడట.

రాజమౌళి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, కచ్చితంగా చెప్తాను అవి పూర్తి అవ్వగానే అని తప్పించుకున్నాడట.ఆ తర్వాత సునీల్ తో ‘మర్యాద రామన్న’ సినిమా తీసాడు.ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది.ఈ సినిమా తర్వాత అయినా రాజమౌళి తన కొడుకు తో సినిమా చేస్తాడు అనుకుంటే, ఆయన ఈగ సినిమా ని ప్రకటించాడు.

ఇక ఆ తర్వాత బాహుబలి సిరీస్ మరియు #RRR వంటి చిత్రాలు వచ్చాయి.అంత రేంజ్ కి వెళ్లిన తర్వాత ఇక అల్లు శిరీష్ తో సినిమా ఎందుకు చేస్తాడు!, అలా తన రిక్వెస్ట్ ని పట్టించుకోలేదని , అప్పటి నుండి అల్లు అరవింద్ మరియు రాజమౌళి మధ్య మాటలు లేవట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube