వంగ సాగును ఆశించే హెలికోవెర్పా గొంగళి పురుగుల నుండి సంరక్షించే పద్ధతులు..!

వంగ సాగును( eggplant ) తీవ్ర నష్టం కలిగించే చీడపీడలలో హెలికోవెర్పా గొంగళి పురుగులు( Caterpillars ) కీలక పాత్ర పోషిస్తాయి.ఈ పురుగులు లేత గోధుమ రంగులో ఉండి దాదాపుగా నాలుగు సెంటీమీటర్ల పొడవు ఉంటాయి.

 Methods Of Protection Against Helicoverpa Caterpillars Infesting Eggplant Cultiv-TeluguStop.com

ఈ గంగోలిపురుగులు వంగ మొక్క మొగ్గలు, కాయలు, ఆకులను రంధ్రాలు చేస్తూ తింటూ ఉంటాయి.ఈ పురుగుల మల పదార్థం ఆకులపై గుర్తించవచ్చు.

ఈ పురుగుల వల్ల సగానికి పైగా దిగుబడి తగ్గే అవకాశం ఉంది.

Telugu Agriculture, Brown Eggs, Eggplant, Latest Telugu, Mary Gold-Latest News -

మొక్కలు పూత, పిందే దశలో ఉన్నప్పుడు మొక్కలపై తెల్లని రంగు నుండి గోధుమ రంగు గుడ్లు( Brown eggs ) గుంపులు గుంపులుగా గుర్తించవచ్చు.ఈ పురుగులు రంద్రాలు చేసిన వంగ కాయలు అమ్మడానికి పనికిరావు.కాబట్టి ఈ పురుగులు పంటను ఆశించకుండా, ఒకవేళ ఆశిస్తే వెంటనే సంరక్షక చర్యలు పాటించి ఈ పురుగులను నివారించాలి.

తెగులు సోకని ఆరోగ్యవంతమైన మొక్కలను మాత్రమే పొలంలో నాటుకోవాలి.మొక్కల మధ్య సూర్యరశ్మి, గాలి బాగా ఉండే విధంగా కాస్త దూరంగా నాటుకోవాలి.పంట పొలంలో పక్షులు వాడడానికి అక్కడక్కడ మేరీ గోల్డ్ మొక్కలు( Mary Gold plants ) నాటుకోవాలి.ఈ పురుగుల ఉనికి గుర్తించేందుకు లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి.

Telugu Agriculture, Brown Eggs, Eggplant, Latest Telugu, Mary Gold-Latest News -

మొక్కలను ఎప్పటికప్పుడు గమనిస్తూ మొక్కలపై గుడ్లు, దెబ్బతిన్న పువ్వులు, పండు మొగ్గలు, దెబ్బతిన్న కాయలను గుర్తించి పంట నుండి వేరు చేసేయాలి.పొలంలో ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను నివారించాలి.పంట మార్పిడి చాలా అవసరం.ఇక ఈ పురుగుల నివారణకు ఒక లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల క్లోరో ఫెరిఫోస్ కలిపి పంటకు పిచికారి చేయాలి.ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉంటే ఫ్లూబెండయ మైడ్ 2.5 మిల్లి లీటర్లను ఒక లీటర్ నీటిలో కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.15 రోజుల వ్యవధిలో ఒకటి లేదా రెండు సార్లు పిచికారి చేసి ఈ పురుగులను అరికట్టాలి.అప్పుడే నాణ్యమైన అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube