ఫోన్‌పే వాడుతున్నారా? అయితే శుభవార్త... క్రెడిట్‌ కార్డ్‌ షురూ!

ఫోన్‌పే( Phonepe ) వాడనివారు ఇక్కడ ఎవరుంటారు చెప్పండి అని అంటారా? అవును, ప్రముఖ ఫిన్‌టెక్‌ దిగ్గజం ఫోన్‌పే వాడనివారు ఇక్కడ దాదాపుగా వుండరు.ప్రతి పదిమందిలో తొమ్మిది మంది ఈ యాప్ ని కలిగి వున్నవారే.

 Phonepe Links 2 Lakh Rupay Credit Cards To Upi,rupay Credit Card, Phonepe, Upi,-TeluguStop.com

ఇపుడు మీకోసం ఫోన్‌పే ఓ శుభవార్తను తీసుకొచ్చింది.విషయం ఏమంటే, ఈ యూపీఐకు 2 లక్షల రూపే క్రెడిట్ కార్డులను విజయవంతంగా అనుసంధానం చేసింది.

దీంతో రూపే క్రెడిట్‌ కార్డ్‌ సాయంతో యూజర్లు, వ్యాపారస్థులు నగదు చెల్లింపులు అనేవి తేలికగా చేసుకోవచ్చు అని ఐఏఎన్‌ఎస్‌ నివేదిక తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది.

Telugu Credit, Phonepe, Rupay Credit, Tech-Latest News - Telugu

ఇప్పటికే రూపే క్రెడిట్‌ కార్డ్‌( Rupay Credit Card )తో యూపీఐ టోటల్‌ పేమెంట్‌ వ్యాల్యూ (టీపీవీ) రూ.150 కోట్ల వరకు చేరుకున్న విషయం తెలిసినదే.కాగా తొలిసారి క్రెడిట్‌ కార్డ్‌ను ఇలా ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయడం వలన దేశంలోనే తొలి సంస్థగా ఫోన్ పే గుర్తింపు సాధించింది.

ఈ నేపథ్యంలో చెల్లింపు సమస్యలకు పరిష్కార మార్గంగా యూపీఐ( UPI ) నిర్వహణ సంస్థ ఎన్‌సీపీఐ భాగస్వామ్యంతో రూపే క్రెడిట్‌ కార్డ్‌ను అందుబాటులోకి తెచ్చామని ఫోన్‌పే తాజాగా వెల్లడించింది.దేశ వ్యాప్తంగా 12 మిలియన్ల మర్చెంట్‌ అవుట్‌ లెట్‌లలో ఆమోదం పొందినట్లు నివేదికలు ఈ విషయాన్ని హైలెట్‌ చేయడం విశేషం.

Telugu Credit, Phonepe, Rupay Credit, Tech-Latest News - Telugu

ఈ నేపథ్యంలో… ఫోన్‌పే కన్జ్యూమర్‌ ప్లాట్‌ఫామ్‌ అండ్‌ పేమెంట్స్‌ వైస్‌ప్రెసిడెంట్‌ అయినటువంటి సోనికా చంద్రా మాట్లాడుతూ… “ఫోన్‌పే యూపీఐ ద్వారా రూ.2లక్షల క్రెడిట్‌ కార్డ్‌ను ఉపయోగించి చెల్లింపులు జరిపేలా ఎన్‌పీసీఐ భాగస్వామ్యంతో చేతులు కలపడం మాకు ఎంతో ఆనందంగా వుంది.అటు కస్టమర్లు, ఇటు వ్యాపారులు జరిపే చెల్లింపుల్ని ఇపుడు మరింత సులభతరం చేసేలా క్రెడిట్‌ కార్డ్‌ ఈకో సిస‍్టంను అభివృద్ధి చేయడం మాకెంతో గర్వకారణంగా వుంది.” అని హర్షం వ్యక్తం చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube