బీజేపీ మాస్టర్ గేమ్.. మళ్ళీ మొదలు పెట్టిందా ?

దేశ రాజకీయాల్లో బీజేపీ హవా ఏ స్థాయిలో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ముఖ్యంగా మోడీ మేనియా( Modi mania )తో కమలం పార్టీకి దేశ వ్యాప్తంగా తిరుగేలేకుండా పోయింది.

 Bjp's Master Plan , Modi Mania , Bjp , Bjp Master Plan , Modi , Uddhav Thacker-TeluguStop.com

మెజారిటీ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నప్పటికి ఇంకా ఏదో తక్కువైందనే భావనలోనే బీజేపీ( BJP ) కనీపిస్తోంది.దేశ వ్యాప్తంగా అన్నీ రాష్ట్రాలలోనూ కాషాయ జెండా ఎగరాలని కమలనాథులు ఎప్పటి నుంచో కలలు కంటున్నారు.

ఆ కలలను నిజం చేసుకునేందుకే శతవిధాల ప్రయత్నిస్తున్నారు.కుదిరితే అధికారం, కుదరక పోతే లాక్కోవడం అనే పంథాలో కమలనాథులు వ్యూహాలు రచిస్తూ ఇతర పార్టీలను బెంబేలెత్తిస్తున్నారు.

Telugu Ajit Pawar, Bjp Master, Ek Nath Shinde, Modi, Modi Mania, Nitish Kumar-Po

సాధారణంగా ప్రజాతీర్పుతో అధికారంలోకి రావడం ప్రజస్వామ్యబద్దం.అలా కాకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి రావడం బీజేపీబద్దం.మహారాష్ట్రలో ఉద్దవ్ థాక్రే ( Uddhav Thackeray )ప్రభుత్వాన్ని కూల్చి ఏక్ నాథ్ షిండే( Ek Nath Shinde )ను ఎలా అధికారంలో కూర్చోబెట్టిందో అందరికీ తెలిసిందే.ఇదే వ్యూహాన్ని బీజేపీయేతర రాష్ట్రాల్లో అమలు చేయాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది.

చాలా రాష్ట్రాలలో ఏక్ నాథ్ షిండే లను పుట్టిస్తామని స్వయంగా కమలనాథులే చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి.బిహార్ లో నితీష్ కుమార్( Nitish Kumar ) ప్రభుత్వాన్ని, ఆదే విధంగా తెలంగాణలో కే‌సి‌ఆర్( KCR ) ప్రభుత్వాన్ని అదే వ్యూహంతోనే కుల్చాలని భావిచ్చినప్పటికి కమలనాథుల కుయుక్తులను గమనించిన కే‌సి‌ఆర్, నితీష్ కుమార్ వంటి వాళ్ళు బీజేపీకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు.

Telugu Ajit Pawar, Bjp Master, Ek Nath Shinde, Modi, Modi Mania, Nitish Kumar-Po

ఇక తాజాగా మహారాష్ట్రలోనే శరత్ పవార్ నేతృత్వంలో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ( NPC ) లో షిండే వ్యూహాన్ని అమలు చేసేందుకు బీజేపీ పావులు కదుపుతునట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఎన్ పీ సి లోని మరో సీనియర్ నేత అజిత్ పవార్( Ajit Pawar ) పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.ఈయన ద్వారానే ఎన్ పీ సి లో చీలిక తెచ్చేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో వినికిడి.ఇప్పటికే 30 మంది దాకా ఎమ్మేల్యేలు తనకు వ్యతిరేకంగా ఉన్నారని శరత్ పవార్ అసహనంగా ఉన్నారు.

కాగా పార్టీ మారడంపై వస్తున్న వార్తలను అజిత్ పవార్ కొట్టిపారేస్తున్నప్పటికి, నిప్పు లేనిదే పొగ రాదు అనే విధంగా అజిత్ పవార్ వైఖరిని ఎత్తి చూపుతున్నారు విశ్లేషకులు.మొత్తానికి పార్టీలలో చీలిక తీసుకొచ్చే మాస్టర్ ప్లాన్లను బీజేపీ మళ్ళీ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

మరి బీజేపీ లిస్ట్ లో ఇంకా ఏ ఏ పార్టీలు ఉన్నాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube