ఎన్టీఆర్ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన సాయి తేజ్.. ఆయన సపోర్ట్ వల్లనే..

మెగా ఫ్యామిలి నుండి మొత్తం పది మంది వరకు హీరోలు వచ్చిన విషయం తెలిసిందే.మరి వీరిలో ప్రేక్షకులకు దగ్గర అయ్యింది మాత్రం కొంతమందే.

 Sai Dharam Tej Said Jr Ntr Supports Me Mightily Apart From My Family, Virupaksha-TeluguStop.com

ఆ కొంత మందిలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఒకరు.మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం చాలా కష్ట పడుతున్నాడు.

ఈ క్రమంలోనే సాయి తేజ్ ( Sai Dharam Tej ) లాంగ్ గ్యాప్ తీసుకుని నటించిన సినిమా ”విరూపాక్ష” ( Virupaksha ).

నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను సుకుమార్ ( Sukumar )శిష్యుడు కార్తీక్ దండు( Karthik Dandu ) తెరకెక్కిస్తుండడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.మేకర్స్ కూడా భారీ నిర్మాణ విలువలతో ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాను నిర్మించారు.ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక అతి త్వరలోనే రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రజెంట్ ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఏప్రిల్ 21న ఈ సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలోనే సాయి తేజ్ తాజాగా ఇచ్చిన ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ (NTR) గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సాయి తేజ్ మాట్లాడుతూ.”మెగా ఫ్యామిలీ తర్వాత తనకు ఎంతో మంచి సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్అని.సినిమాల్లోకి రాకముందు నుండే ఎన్టీఆర్ తో తనకు మంచి అనుబంధం ఉందని.ఈయన చేసిన సపోర్ట్ ఎప్పటికి మర్చిపోలేనని తెలిపారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ ( Sanyukta Menon )హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.చూడాలి సుకుమార్ అసిస్టెంట్ సాయి తేజ్ కు మంచి హిట్ ఇస్తాడో లేదో.

ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం అని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు.మరి సుక్కూ శిష్యుడు ఈయనకు మరో హిట్ ఇస్తాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube