తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే

ఇంతకాలం జనసేన( Janasena ) బీజేపీ బంధం కూడా ఇలాగే నడిచింది .ఎప్పుడో ఒకసారి రూట్ మ్యాప్ ఇవ్వక పోతారా? కలిసి కార్యాచరణ చేయకపోతా మా ? అని ఎదురుచూసిన జనసేన అదినేత ఇక విసిగిపోయినట్టే ఉన్నారు అందుకే జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడిన ఆయన బిజెపి నాయకులు పొత్తు విషయంలో నిజాయితీగా లేరంటూ వ్యాఖ్యలు చేశార.ఈ వ్యాఖ్యలతో ఆలోచనలో పడ్డ రాష్ట్ర కమల నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన హ్యాండ్ ఇవ్వడాన్ని సీరియస్గా తీసుకున్నట్లు కనపడుతుంది .మద్దతు అడిగినా కూడా ఇవ్వకుండా కేవలం జగన్కు వ్యతిరేకంగా మాత్రమే ఓటు వేయాలని పిలుపునివ్వడాన్ని వాళ్ళ జీర్ణించుకోలేకపోతున్నారు.ఇక పొత్తు తో ఉపయోగం లేదని నిర్ణయానికి వచ్చిన రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకత్వం( Central leadership ) తో ఈ దిశగా చర్చలు జరిపినట్టు సమాచారం.మరి పై నుండి ఏమి ఆదేశాలు వచ్చాయో గాని రాష్ట్ర కీలక నాయకుడు మాధవ్ సొంతంగా ఎదగాలనుకుంటున్నామంటూ మీడియా స్టేట్మెంట్ ఇచ్చార.

 Bjp Say Snreakup To Janasena Officially, Janasena , Bjp , Central Leadership,-TeluguStop.com

జనసేనతో పొత్తు ఉన్నా ఒకటె లేకపోయినా ఒకటే అంటూ ఆయన చెప్పుకొచ్చారు ఇక పొత్తులపై వ్యూహాలు మార్చుకున్నామని రాష్ట్రంలో సొంతంగా ఎదగాలనుకుంటున్నామని మద్దతు అడిగినా ఇవ్వని మిత్రపక్షాల వల్ల ఉపయోగం లేదంటూ ఆయన సంచలన వాఖ్యలు చేశారు .

Telugu Bjpsnreakup, Janasena, Pawan Kalyan-Telugu Political News

నిజానికి జనసేన బిజెపి ( BJP )బంధంలో జనసేన మొదటి నుంచి బిజెపికి ప్రాముఖ్యతను ఇస్తూనే వచ్చింది .ఉప ఎన్నికలలో జనసేన బదులు బిజెపి పోటీ చేసినప్పుడు జనసేన మద్దతు ఇచ్చింది అంతేకాకుండా వైసీపీని ఓడించాలంటే ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకోవాలని, కలసి పోరాటాలు చేయాలని దానికి రూట్ మ్యాప్ కావాలి అంటూ ఓపెన్ గా ఆయన అడిగి రెండు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటివరకు ఆ దిశగా బిజెపి ముందుకు రాలేదు.వైసీపీతో తెరచాటు బంధాలు నడుపుతుంది అన్న ఆరోపణలు ఎన్నో వచ్చినా కూడా ఆ దిశగా ఖండించిన పాపాన పోలేదు .వైసీపీతో రాజకీయ అవసరాల నేపథ్యంలోనే అత్యధికంగా ఎంపీ సీట్లు రాజ్యసభలో బలం ఉన్న వైసీపీ( YCP )ని ఇప్పటికిప్పుడు కాదనుకోవడం ఎందుకన్న ఉద్దేశంతోనే మిత్రపక్షం మాటలు తోసిపుచ్చిన బిజేపి ఇప్పుడు అందుకు మూల్యం చెల్లిస్తుంది .ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన దెబ్బతో మిత్ర పక్షం , పొత్తు ధర్మం అంటూ నీతులు చెప్తున్న బిజేపి కి మరి ఇంతకాలం మిత్ర పక్షానికి తాము ఏం చేశామో గుర్తు చేసుకోవాలి .ఇది ఏమైనా బీజేపీతో కొనసాగడం వల్ల పార్టీ జనసేన పార్టీకి కొత్తగా వచ్చినప్రయోజనం ఏమి లేదని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుకు దాదాపు రూట్ క్లియర్ అయినట్టుగానే అర్థమవుతుంది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube