ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో తమ బలం కనిపించాలని జనసేనాని బలంగా ఫిక్స్ అయ్యారు.జనసేన( Janasena ) ఎంఎల్ఏ లు ఈ సారి అసెంబ్లీ లో తమ వాయిస్ వినిపించాలని , ప్రజా సమస్యలపై అసెంబ్లీ లో పోరాడాలని ఆయన కోరుకుంటున్నారు.
అందుకే గత ఎన్నికలలో జరిగిన తప్పులు పునరావృతం కాకూడదనే పట్టుదల ఆయన లో కనిపిస్తుంది .అందుకే తెలుగుదేశంతో పొత్తును సొంత పార్టీలో నేతలు కొంతమంది వ్యతిరేకిస్తున్నా కూడా ఆయన వారందరికి సర్ది చెప్తూ ముందుకు వెళ్తున్నారు .గడిచిన ఎన్నికల్లో జగన్ దెబ్బకు 23 సీట్లకు పరిమితమైపోయిన టిడిపి కూడా పవన్తో పొత్తు ఉంటేనే జగన్ ఓడించగలమనే స్థిర నిర్ణయానికి వచ్చినట్టుగా మొన్నటి వరకు పరిణామాలు కనిపించాయి.అందుకే అధికార పార్టీ ఎంత రెచ్చగొట్టినా కూడా ఒంటరిగా పోటీ చేస్తామనే మాట పవన్ లో కానీ తెలుగుదేశం నాయకుల్లో కానీ వినిపించలేదు.
అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తర్వాత టిడిపిలో కొంత వాయిస్ పెరిగింది జగన్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు( Chandrababu Naidu ) ముఖ్యమంత్రి కావాలని అన్నీ వర్గాల వారు కోరుకుంటున్నారని మన బలాన్ని మనమే తగ్గించుకొని అనవసరంగా పొత్తు పేరుతో సీట్లను వృధా చేసుకోకుండా అన్ని స్థానాల్లోనూ మనమే పోటీ చేయాలని పొత్తు తప్పనిసరి అయినా కూడా కనీసం 150 సీట్లలోనైనా తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేస్తేనే మంచి మెజారిటీ వచ్చి సంకీర్ణ ప్రభుత్వం రాకుండా ఉంటుందని ఇప్పుడు చంద్రబాబు సన్నిహితులు ఆయన కు హితబోధ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
అయితే తన పూర్తి రాజకీయ జీవితంలో ఎన్నడూ తిననన్ని ఎదురు దెబ్బలు అవమానాలు జగన్ ప్రభుత్వం( YS Jagan Mohan Reddy ) హయాంలో చంద్రబాబు ఎదుర్కొన్నారు, ఆయన అనుభవానికి గాని పెద్దరికానికి గాని గౌరవం ఇవ్వకుండా తన కేబినెట్ మంత్రులు చేత చంద్రబాబు నాయుడు గూర్చి అసభ్యంగా మాట్లాడించిన విధానం ఆఖరికి ఆయన భార్యపై కూడా అసహ్యంగా మాట్లాడిన మాటలు చంద్రబాబునాయుడు కి ఎలాగైనా జగనన్న ఓడించాలని పట్టుదల కలిగిందని అందుకే ఎమ్మెల్సీ ఫలితాలు తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు మాటలలో గెలిచామన్న ఆనందం కన్నా జగన్ ను ఓడించామన్న కసి కనపడిందని అందుకే వచ్చే ఎన్నికలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని జగన్ ప్రభుత్వాన్ని ఓడించగలిగే అన్ని అవకాశాలను పరిశీలించాలని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మరొకసారి నష్టపోకూడదని ఆయన తన సన్నిహితులకు సర్ది చెబుతున్నట్టు సమాచారం.ఏప్రిల్ తర్వాత పూర్తిస్థాయిలో సర్వే చేయిద్దామని ఒకవేళ సర్వే ఫలితాలు అనుకూలంగా వస్తే అప్పుడు నిర్ణయం తీసుకుందామంటూఆయన చెప్పారట ఒకవేళ తెలుగుదేశం బలంగా ఉందన్న సర్వే ఫలితాలు వస్తే అప్పుడు జనసేనకి ఒంటరి పోరే శరణ్యమవుతుందంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు .