ఆ విషయంలో నేను ఏ మాత్రం సిగ్గు పడటం లేదు... నటి కుష్బూ కామెంట్స్ వైరల్!

తెలుగు తమిళ భాషలలో నటిగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సీనియర్ నటి కుష్బూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలు సరసన నటించిన ఈమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

 Actress Khushbu Sundar Comments About Allegations On Her Father Details, Actress-TeluguStop.com

ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె గత రెండు రోజుల క్రితం తాను ఎనిమిదేళ్ల వయసులోనే లైంగిక దాడులకు గురయ్యానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇలా ఈ వ్యాఖ్యల ద్వారా ఈమె ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.

తనకు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తన తండ్రి తనపై లైంగికంగా ఆరోపణలు చేస్తూ దాడి చేశారని అయితే తాను 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన తండ్రిని ఎదిరించడంతో ఆయన తన కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయారంటూ ఈమె షాకింగ్ కామెంట్ చేశారు.అయితే తాజాగా మరోసారి ఈ విషయం గురించి కుష్బూ మాట్లాడుతూ నేను తన పట్ల జరిగినటువంటి దాడి గురించి బహిరంగంగా చెప్పినందుకు ఏమాత్రం సిగ్గుపడటం లేదని తెలియజేశారు.నేను చెప్పిన దాంట్లో ఆశ్చర్య పోవాల్సిన పని కూడా లేదని, నిజాయితీగా అందరికీ తెలిసేలా తాను తన జీవితంలో జరిగిన సంఘటనను చెప్పానని ఈమె తెలియజేశారు.

ఈ ఘటనలో నేను బాధితురాలిని, ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి నా తండ్రి కాబట్టి ఈ విషయంలో ఆయన సిగ్గుపడాలి నేను కాదు.నాలాగే ఇలాంటి దాడులను ఎదుర్కొంటున్నటువంటి మహిళలందరూ కూడా ధైర్యంతో ముందడుగు వేయాలని ఈమె యువతకు సూచించారు.ఇలాంటి వాటిని పొరపాటున కూడా ఎంకరేజ్ చేయవద్దని ఈ విషయంలో తాను చాలా ఆలస్యం చేశానంటూ ఈ సందర్భంగా మరోసారి తన తండ్రి తన గురించి చేసినటువంటి లైంగిక ఆరోపణలపై మాట్లాడుతూ కుష్బూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube