శరీరంలోని అధిక వేడి దూరం అవ్వాలంటే.. ఇలా చేయండి..

ఈ మధ్యకాలంలో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి.ఈ ఎండల వల్ల మన శరీరంలో వేడి బాగా పెరిగిపోయింది.

 Follow These Remedies To Reduce Body Heat Details, Remedies ,reduce Body Heat,-TeluguStop.com

అయితే మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో కొన్ని రకాల రెమెడీస్ ని తయారు చేసుకుని వాడడం వల్ల మన శరీరంలోని వేడినీ సులభంగా బయటికి పంపవచ్చు.అధిక వేడిని తగ్గించే ఆ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అదిక వేడి సమస్యతో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ జీలకర్ర, ఇంకా కండ చక్కెర కలిపి రెండు గంటల పాటు నానబెట్టాలి.ఆ తర్వాత ఈ నీటిని తాగాలి.

ఇలా రోజుకు రెండుసార్లు తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గి శరీరం చల్లబడుతుంది.అయితే నానబెట్టినంత సమయం లేనివారు ఈ రెండిటిని సమానంగా తీసుకుని పొడిగా చేసి స్టోర్ చేసుకోవడం మంచిది.

ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాసు నీళ్లలో కలిపి తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.అంతే కాకుండా ఒక గ్లాస్ మజ్జిగలో అర చెక్క నిమ్మరసాన్ని కలిపి తాగడం వల్ల కూడా శరీరంలో వేడి సులభంగా తగ్గుతుంది.ఇంకా చెప్పాలంటే మూడు నుంచి నాలుగు టీస్పూన్ల సబ్జా గింజలను నీటిలో వేసి నానబెట్టుకొని ఆ సబ్జా గింజలను ఒక గ్లాస్ నీళ్లలో వేసి బాగా కలపాలి.

అలాగే ఇందులోని అర చెక్క నిమ్మరసాన్ని కలిపి తాగడం వల్ల శరీరం త్వరగా చల్లబడుతుంది.ఇంకా చెప్పాలంటే ఒక గ్లాస్ నీటిలో తేనెను కలిపి రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే ఆ నీటిని పరిగడుపున తాగడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది.ఇంకా వీటితో పాటు తగినంత నీటిని తాగుతూ ఉండడం మంచిది.

అయితే కొబ్బరి నీటిని ఎండాకాలంలో ఎక్కువగా తాగుతూ ఉండడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube